ల‌య‌న్ మిన్నా? ర‌జ‌నీ చిన్నా?

  • IndiaGlitz, [Wednesday,June 26 2019]

బ‌లాబ‌లాలు, చిన్నాపెద్ద‌ల గురించి చ‌ర్చ‌లు సాగుతున్నాయి. యానిమేటెడ్ ల‌య‌న్ క‌న్నా, సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్ ఎందులో చిన్న అని త‌మిళ‌తంబిలు క‌స్సుమంటున్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన '2.0' ఇదివ‌ర‌కే మ‌న దేశంతో పాటు చాలా దేశాల్లో విడుద‌లైంది. చైనాలో జూలై 12న విడుద‌ల కానున్న‌ట్టు ఈ మ‌ధ్య జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

బాలీవుడ్‌లో ప‌లు సినిమాల‌ను తీసుకుని చైనాలో విడుద‌ల చేసిన హెచ్‌.వై మీడియా ద్వారా చైనాలో విడుద‌ల‌వుతుంద‌ని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా హెచ్‌.వై మీడియా '2.0' విడుద‌ల చేయ‌ట్లేద‌ని చెప్పిన‌ట్టు వినికిడి.

మిడిల్ డ్రాప్‌కు కార‌ణాలేంట‌ని ఆరా తీసిన వాళ్ల‌కు 'ల‌య‌న్ కింగ్‌' అని తేలింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 'ది ల‌య‌న్ కింగ్‌' జులై 19న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో కేవ‌లం వారం రోజుల ముందు మాత్ర‌మే '2.0'ను విడుద‌ల చేయ‌డం వ‌ల్ల పెద్ద‌గా లాభాలేం వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌ని ఈ సంస్థ భావిస్తున్న‌ట్టు తెలిసింది. అయితే 'ది ల‌య‌న్ కింగ్‌' కంటెంట్ ఎవ‌రికీ తెలియ‌నిదేమీ కాదు. ఒక‌సారి సీరీస్‌గా వ‌చ్చింది. మ‌రోసారి 2డీలో వ‌చ్చింది. తాజాగా త్రీ డీ వెర్ష‌న్‌లో రానుంది.

సూప‌ర్‌స్టార్‌గా పేరున్న ర‌జ‌నీ కాంత్ సినిమా క‌న్నా, ల‌య‌న్ కింగ్‌కున్న క్రేజ్ గొప్ప‌ద‌ని దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చ‌ని విశ్లేష‌కుల భావ‌న‌.

More News

సింగ‌ర్‌గా మారిన ప్రియా ప్ర‌కాశ్ ?

మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆడార్ ల‌వ్‌`లో క‌న్నుగీటే స‌న్నివేశంతో నేష‌న‌ల్ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది ప్రియాప్ర‌కాశ్‌వారియ‌ర్‌.

జగన్, మంత్రులపై షాకింగ్ న్యూస్ వెలుగులోకి..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఎంగా వైఎస్ జగన్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే.

బీజేపీలోకి ‘సమంత’ సపోర్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

నవ్యాంధ్రలో చంద్రబాబుకు కొత్త ఇళ్లు దొరికిందోచ్..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో ఇప్పటికే అమరావతిలోని ఉండవల్లిలో ఉండే ప్రజావేదికను అధికారులు కుప్పకూల్చిన సంగతి తెలిసిందే.

రైతన్నకు జగన్ సర్కార్ శుభవార్త.. టీడీపీకి మరో షాక్!

వైసీపీ అధికారంలోకి వస్తే రైతన్నలకు శుభవార్త చెబుతామని.. ముఖ్యంగా పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో పదేపదే వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.