రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లవ్ స్టోరీ తెరకెక్కనుందా...?
- IndiaGlitz, [Friday,February 17 2017]
మాజీ ప్రధాని, క్రాంగెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత రాజకీయంగా జరిగిన పరిణామాలతో రాజీవ్‌గాంధీని ఎల్.టి.టి.ఇ చంపేయడంతో సోనియా గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
ఇప్పుడు ఈ సంగతులను పక్కకు పెడితే ఇప్పుడు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల ప్రేమకథను బుల్లితెరపై తెరకెక్కిస్తారట. రాజీవ్ గాంధీగా బుల్లి తెర నటుడు కరణ్వీర్ బోరా, సోనియా గాంధీగా ప్రియా బెనర్జీ నటిస్తారట. సినీ ప్రముఖుల జంటలకు సంబంధించిన లఘుచిత్రాలు రావడం కామన్‌గా జరుగుతుంటాయి. అందులో భాగంగా ఇప్పుడు రాజీవ్, సోనియా ప్రేమకథ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట.
అయితే ఇందులో కేవలం వారి ప్రేమకథను మాత్రమే చూపిస్తారట. ఎక్కడా రాజకీయాన్ని చూపెట్టరట.