'రాజుగారి గది 2' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Saturday,April 29 2017]

ఓం న‌మో వేంక‌టేశాయ' సినిమా త‌ర్వాత అక్కినేని నాగార్జున హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ 'రాజుగారి గ‌ది 2' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మ‌నుషుల మైండ్స్‌తో ఆట‌లాడే వ్య‌క్తి పాత్ర‌లో నాగార్జున క‌న‌ప‌డ‌బోతున్నాడు. నాగార్జున లుక్ కూడా విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో పివిపి సినిమా, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు శీర‌త్ కపూర్, స‌మంత కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం రాజుగారి గ‌ది 2 చిత్రాన్ని జూలై 7న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు బావిస్తున్నార‌ట‌. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంద‌ట‌. నిర్మాణాంతర కార్య‌క్ర‌మాల‌ను జూన్‌లోపూర్తి చేసి సినిమాను జూలై 7న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నిర్మాత‌లు యోచిస్తున్నార‌ట‌.