'రాజుగారింట్లో 7వ రోజు' పాటలు విడుదల

  • IndiaGlitz, [Saturday,November 21 2015]

భరత్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అజయ్‌ ప్రధానపాత్రలో భరత్‌, అర్జున్‌, వెంకటేష్‌, అక్షయ్‌, సుష్మిత నటీనటులుగారూపొందిన చిత్రం 'రాజుగారింట్లో 7వ రోజు'. ఫిరోజ్‌ రాజ దర్శకత్వంలో భరత్‌కుమార్‌ పీలం ఈ చిత్రాన్నినిర్మించారు. కనిష్క్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. కార్య‌క్ర‌మంలో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ, హీరో త‌రుణ్‌, రామసత్యనారాయణ, నటుడు చిన్నా, మాదాల రవి, సాయివెంకట్‌, భరత్‌, అర్జున్‌, వెంకటేష్‌, అక్షయ్‌, సుష్మిత, దర్శకుడు ఫిరోజ్‌ రాజ, నిర్మాత భరత్‌కుమార్‌ పీలం, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కనిష్క్‌ తదితరులు పాల్గొన్నారు. త‌మ్మారెడ్డి బిగ్ సీడీని విడుద‌ల చేశారు. హీరో త‌రుణ్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేసి తొలి సీడీని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌కు అందించారు.

ఈ సంద‌ర్భంగా...

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.... బాహుబ‌లి, శ్రీమంతుడు వంటి పెద్ద సినిమాలే కాదు సినిమా చూపిస్త మావ‌, రాజుగారి గ‌ది వంటి చిన్న చిత్రాలు కూడా మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. కాన్సెప్ట్ మంచిగా ఉంటే చాలు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఈ మధ్య మంచి కాన్సెప్ట్‌ సినిమాలన్నీ మంచి సక్సెస్‌ను సాధిస్తున్నాయి. రీసెంట్‌గా హిట్‌ కొట్టిన రాజుగారి గది చిత్రమే అందుకు ఉదాహరణ. అలాగే సినిమా పెద్ద సక్సెస్‌ను సాధించాలి. సినిమా ట్రైలర్స్‌, పాటలు బావున్నాయి. కనిష్క్‌ మంచి మ్యూజిక్‌ అందించాడు. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

హీరో తరుణ్‌ మాట్లాడుతూ .....ముందుగా యూనిట్ స‌భ్యుల‌కు ఆల్ ది బెస్ట్‌. భ‌ర‌త్‌, అర్జున్‌లతో మంచి ప‌రిచ‌యం ఉంది. ఈ సినిమాకు వారెంతో క‌ష్ట‌ప‌డ్డారు. వారి క‌ష్టానికి త‌గిన విధంగా రాజుగారి గది కంటే ఈ సినిమా 7రెట్లు పెద్ద విజయాన్ని సాధించాలి. క‌నిష్క్ మంచి సంగీతాన్ని అందించాడు. ఈ బ్యానర్‌కు పెద్ద స‌క్సెస్‌తో పాటు బాగా డ‌బ్బులు వ‌చ్చి మ‌రిన్ని మంచి చిత్రాలు చేయాల‌ని కోరుకుంటుంటున్నాను.'' అన్నారు.

దర్శకుడు ఫిరోజ్‌ రాజ మాట్లాడుతూ.... భరత్‌ ఈ సినిమాకు డబ్బే కాదుహార్డ్ వ‌ర్క్‌తో చేశాడు. 'హర్రర్‌, కామెడి, థ్రిల్లర్‌ సహా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమిది.కనిష్క్‌ నాలుగు అద్భుతమైన సాంగ్స్‌ను, రీరికార్డింగ్‌ను అందించారు. ప్రతి ఒక్క‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

హీరో,నిర్మాత భరత్‌ మాట్లాడుతూ...'కామెడి బేస్‌డ్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీ. ఫిరోజ్‌ రాజ సినిమాను చక్కగా డైరెక్ట్‌ చేశారు. కనిష్క్‌ సంగీతం చాలా బావుంది. యూనిట్‌ అందరం కష్టపడి చేశాం. సినిమా బాగా వచ్చింది. సపోర్ట్‌ చేసిన ఆర్టిస్ట్‌లకు, టెక్నిషియన్స్‌కు థాంక్స్‌. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌లకు ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ కనిష్క్‌ మాట్లాడుతూ...'నేను హీరో తరుణ్‌కు పెద్ద అభిమానిని. ఆయన న‌టించిన సినిమాల‌ను రెగ్యుల‌ర్ చూస్తుంటాను. నువ్వేకావాలి, నువ్వులేక‌నేను లేను వంటి చిత్రాల‌కు నేను పెద్ద అభిమానిని ఈరోజు ఆయ‌న చేతుల మీదుగా ఆడియో విడుదల కావడం ఆనందంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్‌ను అభినందించారు.

ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి కె.కుమార్‌, మ్యూజిక్‌: కనిష్క్‌, నిర్మాత: భరత్‌కుమార్‌ పీలం, రచన, దర్శకత్వం: ఫిరోజ్‌ రాజ.

More News

వెంకీ కొత్త టైటిల్...

విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా మారుతి దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ తనయుడు ఎస్.నాగవంశీ నిర్మాతగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

బ్రహ్మోత్సవం ఆగింది..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ మూవీలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు.

పూరి సీక్రెట్ గా కానిచ్చేశాడు...

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా బ్రదర్ తనయుడు నాగబాబు తనయుడు వరుణ్తేజ్ హీరోగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం 'లోఫర్'.

ఐఫా కి హోస్ట్ గా అల్లు శిరీష్...

ప్రతి సంవత్సరం గ్రాండ్ గా జరిగే చలన చిత్ర అవార్డ్స్ వేడుకలో ఐఫా ఒకటి.ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ.

నిఖిల్ కి పోటీగా వస్తున్నసూర్య...

నిఖిల్ నటించిన తాజా చిత్రం శంకరాభరణం. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నందనవనమ్ తెరకెక్కించారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి కథ-కథనం-మాటలు అందించడంతో పాటు చిత్ర సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం