close
Choose your channels

మీడియాపై ర‌కుల్ ఆగ్ర‌హం!!

Saturday, June 27, 2020 • తెలుగు Comments

మీడియాపై ర‌కుల్ ఆగ్ర‌హం!!

తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల‌తో సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న ముద్దుగుమ్మ‌ల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. ఈ అమ్మ‌డుకి సోష‌ల్ మీడియాలో త‌న‌పై చ‌క్క‌ర్లు కొడుతున్న వార్తొక‌టి చాలా కోపాన్ని తెప్పించింది. ఇంత‌కూ ర‌కుల్‌కి కోపాన్ని తెప్పించిన వార్తేమిటో తెలుసా? శివ‌కార్తికేయ‌న్‌తో ర‌కుల్ అయ‌ల‌న్ అనే సినిమాలో న‌టించాల్సి ఉంద‌ని, అయితే షూటింగ్‌కు ర‌కుల్ హాజ‌రు కావ‌డం లేద‌ని, దీంతో నిర్మాత‌లు మ‌రో హీరోయిన్‌ను వెతుక్కుంటున్నార‌ని. ఈ వార్త‌పై ర‌కుల్ గట్టిగానే రెస్పాండ్ అయ్యింది. ఇదెక్క‌డి జ‌ర్న‌లిజం అంటూ మండిప‌డుతూ ట్వీట్ చేసింది. నిజా నిజాలు తెలుసుకుని వార్త‌లు రాయాల‌ని కూడా చెప్పుకొచ్చింది ర‌కుల్‌.

మీడియాపై ర‌కుల్ ఆగ్ర‌హం!!

ప్ర‌స్తుతం రకుల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి నితిన్, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి సినిమా ఒక‌టి కాగా.. మ‌రో చిత్రం ఇండియ‌న్ 2. అలాగే బాలీవుడ్‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా రూపొందుతోన్న ‘థాంక్ గాడ్’ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించ‌నుంది. గ‌త ఏడాది అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో ర‌కుల్ న‌టించిన చిత్రం దే దే ప్యార్ దే ఆమెకు మంచి పేరుని తెచ్చి పెట్టింది. అందుక‌నే మ‌రోసారి అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ ఫిట్‌నెస్ ఫ్రీక్‌కు అవ‌కాశం క‌ల్పించి ఉంటాడ‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. కరోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇంటికే ప‌రిమిత‌మైన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌పై మరింత ఫోక‌స్‌గా ఉంది. ఆమె చేస్తున్న యోగాలు, ఎక్సర్‌సైజుల వీడియోలో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz