రకుల్ ప్రీత్ కు బాలీవుడ్ ఆఫర్

  • IndiaGlitz, [Monday,March 30 2020]

పంజాబీ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. అయితే ఒక‌ప్పుడు ఉన్నంత స్పీడుగా ర‌కుల్ కెరీర్ లేద‌నేది వాస్త‌వం. ప్ర‌స్తుతం ఆమె రెండు చిత్రాలు మాత్ర‌మే ఉన్నాయి. అవి కూడా త‌మిళ చిత్రాలే. తెలుగు చిత్ర‌సీమ ర‌కుల్‌పై శీత‌కన్ను వేసింది. ఈ రెండు చిత్రాల్లో ఒక‌టి శివ‌కార్తీకేయ‌న్ సినిమా కాగా.. మ‌రో చిత్రం ఇండియ‌న్ 2. ఈ చిత్రంలోనూ ర‌కుల్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌క‌పోవ‌చ్చు. ఇలాంటి త‌రుణంలో ర‌కుల్‌కు మంచి అవ‌కాశం త‌లుప తట్టింద‌ట‌.

వివ‌రాల మేర‌కు అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా రూపొందుతోన్న ‘థాంక్ గాడ్’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంద‌ట‌. అస‌లు అవ‌కాశాలు లేని ర‌కుల్‌కు ఇది పెద్ద అవ‌కాశంగానే చెప్పొచ్చు. గ‌త ఏడాది అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో ర‌కుల్ న‌టించిన చిత్రం దే దే ప్యార్ దే ఆమెకు మంచి పేరుని తెచ్చి పెట్టింది. అందుక‌నే మ‌రోసారి అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ ఫిట్‌నెస్ ఫ్రీక్‌కు అవ‌కాశం క‌ల్పించి ఉంటాడ‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

కరోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇంటికే ప‌రిమిత‌మైన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌పై మరింత ఫోక‌స్‌గా ఉంది. ఆమె చేస్తున్న యోగాలు, ఎక్సర్‌సైజుల వీడియోలో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

More News

బ‌న్నీ సీక్రెట్‌ను బ‌య‌ట పెట్టిన త్రిష‌

క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌తో ఇండియా మొత్తం లాక్ డౌన్ అయ్యింది. సినిమా షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. స్టార్స్ అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైయారు. వేరే ప‌నులేవీ లేక‌పోవ‌డంతో అంద‌రూ

కరోనాపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితితో ఇరు రాష్ట్రాల ప్రజల భయపడిపోయారు.

అస‌లు త‌గ్గ‌నంటోన్న నిధి అగ‌ర్వాల్‌

గ్లామ‌ర్ డాల్ నిధి అగ‌ర్వాల్‌కు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. ఇక త‌మిళంలో గ‌త ఏడాది ఓ సినిమాలో మాత్రం న‌టించింది. అయినా కూడా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో అస‌లు త‌గ్గ‌నంటోంద‌ట ఈ బ్యూటీ.

'మోస‌గాళ్ళు' క‌థ ఇదేనా?

మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం ‘మోస‌గాళ్ళు’. తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లోనూ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు

'వ‌కీల్‌సాబ్‌' వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చేస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. బాలీవుడ్ మూవీ పింక్‌కు ఇది రీమేక్‌. దిల్‌రాజు