close
Choose your channels

సెగలు రేపుతున్న రకుల్

Monday, August 19, 2019 • తెలుగు Comments

సెగలు రేపుతున్న రకుల్

పంజాబీ పాలకోవా రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. తన బాడీ ఫిట్‌నెస్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటుంది. అయితే రొటీన్‌కు భిన్నంగా ఈసారి రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. బీచ్‌లో బ్లూ బికినీతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసిన రకుల్ ``పైన ఆకాశం, క్రింద ఇసుక.. లోపల ఆనందం. చుట్టూ అంతా సంతోషమే`` అంటూ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేసింది.

ప్రస్తుతం రకుల్ హాట్ బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా నాగార్జునతో రకుల్ నటించిన మన్మథుడు 2 ప్లాప్ అయ్యింది. తదుపరి ప్రాజెక్ట్స్ వెళ్లడానికి ముందు రకుల్ చిల్ అవుతుంది. రకుల్ ఫొటోలు చూసిన నెటిజన్స్ అందరూ ఫొటోలు చాలా హాట్‌గా ఉన్నాయని అంటున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz