close
Choose your channels

ర‌కుల్ నెక్స్ట్ రిలీజ్ ఇదే!

Friday, August 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌కుల్ నెక్స్ట్ రిలీజ్ ఇదే!

మంచో, చెడో ఏదో ఒక‌టి జ‌రుగుతూ ఉండాలి. నీళ్లు కూడా పారుతూ ఉంటేనే విలువ‌. ఒకే చోట ఉంటే చూడ్డానికి బావుంటుందేమోకానీ, కొన్నాళ్ల‌కు పాచి ప‌ట్టేస్తుంది... ఈ సిద్ధాంతాన్ని బాగా న‌మ్ముతుంది ఫిట్‌నెస్ ఫ్రీక్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. సినిమా స‌క్సెస్‌, ఫెయిల్యూర్ల‌తో సంబంధం లేకుండా త‌ను న‌టించిన సినిమాలు విడుద‌ల‌వుతూ ఉండాల‌న్న‌ది ఆమె కోరుకునే విష‌యం.

ఈ ఏడాది ర‌కుల్ న‌టించిన రెండు సినిమాలు ఇప్ప‌టికే విడుద‌ల‌య్యాయి. వాటిలో ఒక‌టి హిందీ `దేదే ప్యార్ దే`. అజ‌య్ దేవ్ గ‌ణ్ ఇందులో 50 ఏళ్ల వ్య‌క్తిగా క‌నిపిస్తే, ఆయ‌న ప‌క్క‌న ర‌కుల్ 26 ఏళ్ల అమ్మాయిగా, ఆయ‌న‌తో ప్రేమ‌లో ప‌డే వ్య‌క్తిగా క‌నిపించింది.

తెలుగులో నాగార్జున‌తో ర‌కుల్ న‌టించిన `మ‌న్మ‌థుడు2` కూడా ఇలాంటి ఏజ్ గ్యాప్ సినిమానే. ఇందులో నాగార్జున్ ఓల్డ్ హాట్ మ్యాన్ అని కూడా అనిపించుకుంటాడు. అత‌నిక‌న్నా వ‌య‌సులో చిన్న‌దైన ర‌కుల్‌తో ఆయ‌న‌కు డీల్ ఏంటి? అది ప్రేమ‌గా ఎలా మారింద‌న్న‌ది ఈ సినిమా క‌థ‌.

ఈ రెండు సినిమాల త‌ర్వాత ఈ ఏడాది ర‌కుల్ న‌టించిన మూడో సినిమా న‌వంబ‌ర్ 22న విడుద‌ల కానుంది. ఈ సినిమా ద‌క్షిణాది సినిమా కాదు. హిందీ సినిమా. మార్జ‌వాన్ అనే ఈ సినిమాలో ర‌కుల్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌ర‌స‌న న‌టించింది. తారా సుతారియా, రితేష్ దేశ్‌ముఖ్ కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. మిలాప్ జ‌వేరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌వంబ‌ర్ 22న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి అన్నీ ప‌నులు పూర్త‌య్యాయి.

తెలుగులో 2011లో `కెర‌టం` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ర‌కుల్ ప్ర‌స్తుతానికి ఏ సినిమాలూ చేయ‌డం లేదు. `ఇండియ‌న్‌2`లో సిద్ధార్థ్ జోడీగా న‌టిస్తోంది. మ‌రోవైపు శివ‌కార్తికేయ‌న్ న‌టిస్తున్న సినిమాలోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగులో ఎందుకు గ్యాప్ ఇచ్చిందో మాత్రం తెలియాల్సి ఉంది. అన్న‌ట్టు హైద‌రాబాద్‌లో ర‌కుల్ కు సొంత ఫ్లాట్ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.