ర‌కుల్ తెలుగు చిత్రం...

  • IndiaGlitz, [Thursday,December 27 2018]

2018లో తెలుగు సినిమాల్లో న‌టించని ర‌కుల్ ప్రీత్ సింగ్ 2019లో ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' లో శ్రీదేవిగా క‌నిపించ‌నుంది. అలాగే 'వెంకీ మామ‌'లో నాగ‌చైత‌న్య జత‌గా న‌టించ‌నుంది.

కాగా.. ఇప్పుడు మ‌రో తెలుగు సినిమాలో న‌టించనుంది. నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ర‌కుల్ ఓకే అయ్యింద‌ని మీడియా వ‌ర్గాల స‌మాచారం.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా వ‌చ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. ఈలోపు నితిన్ వెంకీ కుడుముల సినిమాను పూర్తి చేస్తాడ‌ట‌. అంటే హీరోయిన్‌గా తెలుగు సినిమా తెర‌పై ర‌కుల్ 2020లోనే క‌న‌పించ‌నుంది.

More News

నాగ్‌, ధ‌నుష్ మ‌ల్టీస్టార‌ర్ ఆగిపోయిందా....

కింగ్ నాగార్జున్‌, త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు ధ‌నుష్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ధ‌నుష్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే కొంత భాగం చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌య్యింది.

"మళ్లీ మళ్లీ చూశా" ఫస్ట్ లుక్ విడుదల

అనురాగ్ కొణిదెన  హీరోగా పరిచయమవుతొన్న చిత్రం "మళ్లీ మళ్లీ చూశా". క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ   రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వ‌ల్గారిటీ లేకుండా లివ్ఇన్ రిలేష‌న్ షిప్ మీద సాగే సినిమా 'ఇష్టంగా' - అర్జున్ మ‌హి

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి రుద్ర‌ దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం `ఇష్టంగా`. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు.

తిత్లీ తుఫాను బారిన పడ్డ గ్రామాల్లో సురక్షిత మంచి నీటికోసం అల్లు అర్జున్ ముందడుగు

అక్టోబర్ రెండో వారంలో వచ్చిన తిత్లీ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాను అతలా కుతలం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 25 మండలాల్లో వెయ్యికి పైగా గ్రామాలు తిత్లీ తుఫాను బారిన పడ్డాయి.

కార్తి 'దేవ్' షూటింగ్ పూర్తి.. 

కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న దేవ్ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. రాజ‌త్ ర‌విశంక‌ర్ ఈ యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాను తెర‌కెక్కిస్తున్నారు.