రకుల్ కు మరో అవకాశం

  • IndiaGlitz, [Friday,July 21 2017]

తెలుగు, త‌మిళ సినిమాల్లో వ‌రుస అవకాశాలతో దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌; ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న 'స్పైడ‌ర్' సినిమాలో న‌టిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌ను కూడా సొంతం చేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే..మ‌హేష్ సినిమా త‌ర్వాత మురుగ‌దాస్‌, హీరో విజ‌య్‌తో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ నటించే అవ‌కాశం ఉంది. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్ హీరోగా తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన మురుగదాస్, మరో బిగ్ హిట్ మీద కన్నేశాడు. అయితే ఈసినిమాకు ముందుగా సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. అయితే సమంత డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవటంతో ఆ ఛాన్స్ రకుల్ చేతికి వెళ్లింది

More News

పాపను దత్తత తీసుకున్న సన్నిలియోన్

శృంగార తార సన్నిలియోన్ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. స్పెషల్ సాంగ్స్ కూడా తనదైన శైళిలో నటిస్తుంది. సన్నిలియోన్ దంపతులు ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నారని సన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

మరాఠా వీరుడి పాత్రలో అజయ్ దేవగణ్

హిస్టారికల్ కాన్సెప్ట్ సినిమాలు ట్రెండ్ కొనసాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్లో పద్మావతి సినిమా ఇప్పుడు తెరకెక్కుతోంది. దీంతో పాటు అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తానాజీ’ సినిమా కూడా తెరకెక్కుతోంది.

బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల నడుమ బీచ్ ఫెస్టివల్ సాంగ్

ఇప్పటికే విడుదలైన టీజర్-పోస్టర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న "జయ జానకి నాయక" ఖాతాలో మరో విశేషం చేరింది. ఎన్నడూలేని విధంగా.. విశాఖపట్నం సమీపంలో మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఓ సెట్ ను నిర్మించింది చిత్ర బృందం.

సంజన గుట్టు విప్పింది

దండుపాళ్యం 2లో సంజన వివస్త్రగా నటించిందనే వార్తలు, కొన్ని ఫోటోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కనిపిస్తున్నాయి. అవేమీ తనకు సంబంధించినవి కావని చెప్పింది సంజన.

'వీఐపీ2' వాయిదా పడింది..!

ధనుష్ హీరోగా నటించిన `వీఐపీ2` విడుదల వాయిదా పడింది. అమలాపాల్ హీరోయిన్గా నటించిన సినిమా ఇది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు.