మనం అరుదుగా చూసే సినిమాల్లో ఒకటి ‘మధ’: ర‌కుల్ ప్రీత్ సింగ్‌

  • IndiaGlitz, [Saturday,March 07 2020]

ఒక‌టి, రెండు అవార్డులు కావు.. ఏకంగా 26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న చిత్రం ‘మ‌ధ‌’. థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య ద‌ర్శ‌క‌త్వంలో ఇందిరా బ‌స‌వ నిర్మించిన ఈ చిత్రం మార్చి 13న విడుద‌ల కానుంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేశారు.

‘‘చాలా చాలా అరుదుగా మనం చూసే చిత్రాల్లో ‘మధ’ ఒకటి. డైరెక్టర్ శ్రీవిద్య బసవ ఈ సినిమా కోసం చేసిన ప్రయాణం నన్ను ఇన్‌స్పైర్ చేసింది. టీజర్ నాలో ఆసక్తిని రేపింది. అద్భుతమైన టీజర్. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’’ అంటూ చిత్ర యూనిట్ను అభినందించారు రకుల్ ప్రీత్ సింగ్.

టీజర్ విషయానికి వస్తే.. ఓ అమ్మాయి మానసిక సమస్యల గురించి చెప్పే చిత్రంగా మధ కనిపిస్తుంది. ‘నేను ఈ ప్రపంచాన్ని చదివింది..చూసింది ఈ కిటికీలో నుండే’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. త్రిష్నా ప్రధాన పాత్రలో నటించింది. ఆమె చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఆమె ఏదో మానసిక సమస్యతో బాధపడుతుందని, దేనికో భయపడుతుందని టీజర్ ద్వారా చెప్పారు డైరెక్టర్ శ్రీవిద్య బసవ. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్భంగా

డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ - ‘‘‘మధ’ చిత్రం టీజర్‌ను విడుదల చేసి మా యూనిట్‌ను ఎంకరేజ్ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కి అభినందనలు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన చిత్రం. ఈ సినిమా చేయడానికి మూడేళ్ల జర్నీ చేశాం. నాతో పాటు ఎంటైర్ యూనిట్ ఎంతగానో కష్టపడ్డారు. అలాగే మా సినిమా విడుదలకు సపోర్ట్ చేస్తున్నహ‌రీశ్‌గారు, మ‌హేశ్‌గారు, న‌వ‌దీప్‌గారికి థాంక్స్‌. ప్ర‌తి అమ్మాయి ఈ సినిమా కాన్సెప్ట్‌కి క‌నెక్ట్ అవుతుంది. స్త్రీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను చూపిస్తున్నాం. మార్చి 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. కంటెంట్ అంద‌రికీ నచ్చుతుంది’’ అన్నారు.

నటీనటులు: రాహుల్, త్రిష్నా ముఖ‌ర్జీ త‌దిత‌రులు

More News

మ‌రో యంగ్ డైరెక్ట‌ర్‌కి నాని గ్రీన్ సిగ్న‌ల్‌..?

నేచుర‌ల్ స్టార్ నాని ఒక‌వైపు హీరోగా, మ‌రో వైపు నిర్మాత‌గా ఫుల్ స్పీడుమీదున్నాడు. రీసెంట్‌గా నిర్మాత హిట్‌తో హిట్ అందుకున్నాడు నాని.

‘థాంక్యూ’ అనబోతున్న చైతన్య!

అక్కినేని నాగచైత‌న్య ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్‌స్టోరి’ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

రామ్ ఆ డైరెక్ట‌ర్‌కి ఓకే చెబుతాడా?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం ‘రెడ్’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే రామ్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ..

చ‌ర‌ణ్ నెక్స్‌ట్ మూవీ కొత్త ద‌ర్శ‌కుడితోనా?

కెరీర్ ప్రారంభంలో చిరుత‌, ర‌చ్చ వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసినా.. ‘రంగ‌స్థ‌లం’ వంటి భారీ హిట్ త‌ర్వాత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్

ప‌వ‌న్ 27 రిలీజ్ డేట్‌... ఫ్యాన్స్‌కు పండ‌గే..

తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ‘వ‌కీల్ సాబ్‌’ షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు.