ర‌కుల్ స్పెష‌ల్‌...

  • IndiaGlitz, [Wednesday,February 20 2019]

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. అందుకు కార‌ణం, క‌ష్టం త‌క్కువ‌.. మంచి రెమ్యున‌రేష‌న్ వ‌స్తుంది. ఇప్పుడు వీరి బాట‌లో ర‌కుల్ చేర‌నుంది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ స్పెష‌ల్ సాంగ్‌లో త‌ళుక్కున మెర‌వ‌నుంది.

వివ‌రాల్లోకెళ్తే.. నేచుర‌ల్ స్టార్ నాని, విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం చిత్రీక‌ర‌ణను స్టార్ట్  చేసుకుంది. ఆర్‌.ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ ఇందులో కీల‌క పాత్ర‌ధారిగా న‌టిస్తున్నాడు.

కాగా .. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను చిత్ర యూనిట్ సంప్ర‌దించిద‌ట‌. మ‌రి ర‌కుల్ పాట‌లో న‌ర్తించ‌డానికి ర‌కుల్ ఒప్పుకుందా లేదా? అని తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో సినిమా తెరెకెక్కుతోంది.