రకుల్ ప్రీత్ టీ షర్ట్ ఛాలెంజ్

  • IndiaGlitz, [Sunday,April 12 2020]

నేటి త‌రం కుర్ర హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ఫిట్‌నెస్ విష‌యంలో ఉన్నంత కేర్ మ‌రొక‌రికీ లేదంటే అవున‌న‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ర‌కుల్‌కు ఏ మాత్రం ఖాళీ దొరికినా ఏదో ర‌క‌మైన ఎక్స‌ర్‌సైజ్ చేస్తూనే ఉంటుంది. స‌ద‌రు వీడియోను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌నూ పోస్ట్ చేస్తుంటుంది. రీసెంట్‌గా కాళ్ల‌ను గోడ‌కు అనించి చేతుల‌తో శ‌రీరాన్ని బాలెన్స్ చేస్తూ టీ ష‌ర్ట్ ఎలా వేసుకోవాలో ర‌కుల్ చేసి చూపెట్టి అంద‌రికీ షాకిచ్చింది ర‌కుల్‌.

పంజాబీ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. అయితే ఒక‌ప్పుడు ఉన్నంత స్పీడుగా ర‌కుల్ కెరీర్ లేద‌నేది వాస్త‌వం. ప్ర‌స్తుతం ఆమె రెండు చిత్రాలు మాత్ర‌మే ఉన్నాయి. అవి కూడా త‌మిళ చిత్రాలే. తెలుగులో ఎప్పుడో కమిట్ అయిన నితిన్, చంద్రశేఖర్ ఏలేటి సినిమా మాత్రమే ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో రకుల్ జత కట్టింది. ఇప్పుడు తెలుగు చిత్ర‌సీమ ర‌కుల్‌పై శీత‌కన్ను వేసింది. ఇది కాకుండా బాలీవుడ్‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో ‘థాంక్‌గాడ్‌’ సినిమాలోనూ ర‌కుల్ న‌టించ‌నుంద‌ట‌.

More News

ప్యాన్ ఇండియా ప్ర‌య‌త్నం చేస్తున్న నిఖిల్‌

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ గ‌త ఏడాది ‘అర్జున సుర‌వ‌రం’తో స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు.

క‌రోనా టైమ్‌లో నితిన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

క‌రోనా వైర‌స్ నివార‌ణ చర్య‌ల‌కు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఈ నెల 30 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. ప్ర‌జలు, సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు..: కేసీఆర్

తెలంగాణలో ఏప్రిల్-30 వరకు లాక్‌డౌన్ కొనసాగింపు ఉంటుందని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. శనివారం నాడు సాయంత్రం సుమారు నాలుగున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది.

చిరు లేడీ ఫ్యాన్‌కు హార్ట్ సర్జరీ సక్సెస్.. ధన్యవాదాలు

గుంటూరు జిల్లా ‘చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్ధ’ అధ్యక్షురాలు, చిరు వీరాభిమాని కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి

చైనాలో కరోనా వ్యాప్తి కట్టడికి రంగంలోకి రోబోలు!

చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా మమమ్మారి ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే 200 పైచిలుకు దేశాలు దాటేసిన ఈ వైరస్‌తో ఇటలీ, స్పెయిన్,