close
Choose your channels

మోహ‌న్‌బాబు చిత్రంలో ర‌కుల్‌..?

Wednesday, November 25, 2020 • తెలుగు Comments

మోహ‌న్‌బాబు చిత్రంలో ర‌కుల్‌..?

విలక్ష‌ణ న‌టుడిగా, నిర్మాత‌గా సినీ రంగంలో త‌న‌దైన ముద్ర‌వేసిన క‌లెక్ష‌న్ కింగ్ డా.మోహ‌న్‌బాబు, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నాలుగున్న‌ర ద‌శాబ్దాలు పూర్త‌య్యాయి. ఈ ఏడాది సూర్య హీరోగా న‌టించిన ‘ఆకాశం నీ హ‌ద్దురా’ చిత్రంలో మోహ‌న్‌బాబు కీల‌క పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. అలాగే ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సినిమా ‘స‌న్నాఫ్ ఇండియా’ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాను డైమండ్ ర‌త్నం తెర‌కెక్కిస్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు, ఈ సినిమాలో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టింనుంద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంద‌నే దానిపై ఇంకా పూర్తి స‌మాచారం అంద‌డం లేదు.

క్ర‌మంగా ర‌కుల్‌కు అవ‌కాశాలు త‌గ్గిపోతున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తోన్న నేప‌థ్యంలో ఉన్న‌ట్లుండి మ‌రోసారి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోందీ ఫిట్‌నెస్ ఫ్రీక్‌. ఇప్ప‌టికే నితిన్ ‘చెక్’ సినిమాలో న‌టించింది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్‌తో క‌లిసి మ‌రో సినిమాలో న‌టిస్తుంది. ఇది కాకుండా ఓ బాలీవుడ్ చిత్రంలోనూ ర‌కుల్ న‌టిస్తుంది. ఇప్పుడు మోహ‌న్‌బాబు సినిమాలో కీల‌క పాత్ర‌ను పోషించ‌నుంది. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాదిలోనే విడుదల కానున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz