నేడు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకానున్న రకుల్

  • IndiaGlitz, [Friday,September 25 2020]

బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఒక్క బాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో స్టార్ హీరోయిన్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఎన్సీబీ నోటీసులు అందుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు విచారణకు హాజరు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రకుల్ ముంబై చేరుకుంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి, రకుల్‌కు మధ్య క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉండటంతో పాటు.. ఇద్దరూ కలిసి డ్రగ్స్ వాడారన్న అనుమానాలు ఉండటంతో ఎన్సీబీ నోటీసులు జారీ చేసింది.

నిజానికి ఎన్సీబీ ఇచ్చిన సమన్ల ప్రకారం రకుల్ నిన్ననే విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు సమన్లు అందలేదని.. అందుకే హాజరు కావడం లేదని రకుల్ లీగల్ టీం వెల్లడించింది. దీంతో ఎన్సీబీ మరోసారి సమన్లు జారీ చేసింది. దీంతో రకుల్ గత రాత్రి ముంబై చేరుకుంది. మరోవైపు ఇప్పటికే రకుల్‌ను అడగాల్సిన ప్రశ్నల జాబితాను ఎన్సీబీ సిద్ధం చేసినట్టు సమాచారం. మరి ఈ విచారణలో రకుల్ ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు రకుల్‌తో పాటు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌లకు కూడా ఎన్సీబీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. వీరందరినీ విచారించేందుకు ఎన్సీబీ అధికారులు అన్ని ఏర్పాట్లనూ చేస్తున్నారు. దీపిక విషయానికి వస్తే రేపు విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీపిక మేనేజర్‌ను మాత్రం నేడే ఎన్సీబీ అధికారులు ప్రశ్నించనున్నట్టు సమాచారం. ఈ విచారణ అనంతరం దీపిక కోసం ఎన్సీబీ అధికారులు ప్రశ్నల జాబితాను సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. రేపు సారా, శ్రద్ధా కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

More News

బిగ్ బాస్ 4: అభికి దూరమవుతున్న మోనాల్.. దగ్గరవుతున్న హారిక

మైండ్ బ్లాక్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. రోబోల చార్జింగ్ అయిపోవడంతో చిన్నగా అవినాష్ వచ్చి అమ్మ రాజశేఖర్ పక్కన కూర్చొని స్మార్ట్‌గా చార్జింగ్ పెట్టుకున్నాడు.

రేపటి నుంచి సిటీ బస్సులు ప్రారంభం

రేపటి నుంచి హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 180 రోజుల క్రితం సిటీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మరింత విషమించిన గాన గంధర్వుడి ఆరోగ్యం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది. ఆగస్ట్ తొలి వారంలో కరోనా బారిన పడిన ఆయన అప్పటి నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

అర్బన్ మాంక్ లుక్‌.. ‘వేదాళం’లో ఆ పార్ట్ కోసమేనట.. చిరు క్లారిటి

ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో అభిమానులంతా ఆశ్చర్యపోయారు. అర్బన్ మాంక్‌ లుక్‌లో తొలిసారి చిరు అభిమానుల ముందుకు వచ్చారు.

రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యమివ్వండి: పవన్

అంతర్వేది లక్ష్మీనారసింహుని రథం దగ్ధం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో నూతన రథం నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.