సచిన్ కోసం రిపోర్టర్ గా మారింది

  • IndiaGlitz, [Monday,May 22 2017]

ప్ర‌స్తుతం ఇండియాకు పేరు తెచ్చిన ఆట‌గాళ్ళ జీవిత క‌థ‌ల నేప‌థ్యంలో చాలా సినిమాలే వ‌చ్చాయి. మేరీకోమ్‌, బాగ్ మిల్కాభాగ్‌, దంగ‌ల్ ఇలా చాలా సినిమాలే రూపొంది ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను పొందాయి. అలాగే క్రికెట్ ఆటగాళ్ళు ధోని, అజ‌హర్‌ల‌పై కూడా సినిమాలు రూపొందాయి. ఇప్పుడు రూపొందిన క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌పై రూపొందిన చిత్రం 'స‌చిన్- ఎ బిలియ‌న్ డ్రీమ్స్'. జేమ్స్ ఎరిక్‌సినే ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి భ‌గ‌త్ చంద్‌కా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమా మే 26న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా స‌చిన్ టెండూల్క‌ర్ కూడా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా స‌చిన్ సినిమా కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ రిపోర్ట‌ర్‌గా మారింది. త‌న‌కు స‌చిన్ అంటే బోల్డంత అభిమాన‌మంని, అయ‌న్ను ఇంట‌ర్వ్యూ చేయ‌డం మ‌ర‌చిపోలేని విష‌య‌మ‌ని ర‌కుల్ తెలియజేసింది. ఆట‌గాడుగా ఎన్నో రికార్డుల‌తో ఎవ‌రెస్ట్ శిఖర‌మంత ఎత్తు ఎదిగిన స‌చిన్ జీవిత‌క‌థ‌పై సినిమా అంటే చాలా అంచ‌నాలే నెల‌కొన్నాయి. మ‌రి క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఈ సినిమా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

ట్రెమెండస్ రెస్పాన్స్ రాబట్టుకున్న 'అంధగాడు' థియేట్రికల్ ట్రైలర్

యువ కథానాయకుడు రాజ్తరుణ్ `అంధగాడు`గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

'2.0' నైజాం హక్కులను దక్కించుకున్న...

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబో సీక్వెల్గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

బాహుబలికి ఎ.ఆర్.రెహమాన్ ప్రశంస..

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన విజువల్ వండర్ `బాహుబలి-2` 1500 కోట్ల కలెక్షన్స్ను దాటి బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటుతుంది.

కన్నడ హీరోయిన్ తో ఆది...

డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా ప్రయత్నాలు చేస్తూనే మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో `శమంతకమణి` అనే మల్టీస్టారర్లో నటిస్తున్నాడు.

'దర్శకుడు' టీజర్ విడుదల చేసిన యంగ్ టైగర్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై తెరకెక్కుతోన్న చిత్రం 'దర్శకుడు'. అశోక్, ఈషా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా దర్శకుడు.