close
Choose your channels

సైరా రిలీజ్ గురించి చెప్పిన చెర్రీ

Tuesday, January 8, 2019 • తెలుగు Comments

సైరా రిలీజ్ గురించి చెప్పిన చెర్రీ...

చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకుడు. రాంచ‌ర‌ణ్‌ నిర్మాత. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, త‌మన్నా, జగపతిబాబు, కిచ్చా సుదీప్ తది తరులు నటిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

ఈ సినిమా విడుద‌ల గురించి నిర్మాత రాంచ‌ర‌ణ్ కొత్త విష‌యాన్ని చెప్పారు. అదేంటంటే ముందుగా సినిమాను ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ ఇప్పుడు సైరా స‌మ్మ‌ర్‌లో రావ‌డం లేద‌ట‌. సినిమాను విజ‌య‌ద‌శ‌మికి విడుద‌ల చేసేలా ప్లాన్స్ చేస్తున్నార‌ట‌. రెండు నెల‌ల్లో చిత్రీక‌ర‌ణంతా పూర్త‌వుతుంద‌ట‌. త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేస్తార‌ట‌.