close
Choose your channels

మ‌రో రీమేక్ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న చ‌ర‌ణ్‌

Monday, February 17, 2020 • తెలుగు Comments

మ‌రో రీమేక్ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న చ‌ర‌ణ్‌

ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ రామ్‌చ‌ర‌ణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఒక ప‌క్క హీరోగా న‌టిస్తూనే సినిమాల‌ను కూడా నిర్మిస్తున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం చిరంజీవి 152వ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హరిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా.. మల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఈ సినిమాను కూడా మెగాస్టార్ చిరంజీవితోనే నిర్మించాల‌నుకుంటున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. కాగా.. తాజా స‌మాచారం మేరకు చ‌ర‌ణ్ మ‌రో మ‌ల‌యాళ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాడ‌ట‌. ఆ చిత్ర‌మేదో కాదు.. `డ్రైవింగ్ లైసెన్స్‌`.

మ‌రి రామ్‌చ‌ర‌ణ్ ఈ మ‌ల‌యాళ సినిమాను ఏ హీరోతో చేస్తాడ‌నే ఆస‌క్తిగా మారింది. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మెగా హీరోల్లో ఎవ‌రో ఒక‌రితో చ‌ర‌ణ్ ఈ సినిమా చేస్తాడ‌ని టాక్‌. ఈ ఏడాది చివ‌ర‌లో కానీ.. లేదా వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలో కానీ ఈ సినిమాను చ‌ర‌ణ్ రీమేక్ చేస్తాడ‌ని టాక్‌.

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న రామ్‌చ‌ర‌ణ్ హీరోగా.. త‌దుపరి ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. అయితే చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రంలో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌. 

Get Breaking News Alerts From IndiaGlitz