close
Choose your channels

రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్ని అతిథులుగా...

Sunday, December 16, 2018 • తెలుగు Comments

రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్ని అతిథులుగా...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హాజ‌ర‌వుతున్నారు. వివ‌రాల్లోకెళ్తే శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు'.

హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జ‌ర‌గ‌నుంది. దీనికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజర‌వుతున్నాడు.

అలాగే మెగా క్యాంప్ హీరో వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య‌త్రిపాఠి, అదితిరావు హైద‌రి తారాగ‌ణంగా న‌టించిన చిత్రం 'అంత‌రిక్షం 9000 కె.ఎం.పి.హెచ్‌'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న జ‌ర‌గ‌నుంది. దీనికి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz