నీలా కాదు.. టైమ్ అంటే టైమే: చెర్రీ.. 5 నెలలు లేటు: తారక్

  • IndiaGlitz, [Wednesday,October 21 2020]

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా నుంచి హీరో రామ్ చరణ్ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన వీడియో టీజర్‌ను పోస్ట్ చేశాడు. కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో దానిలోని క్లిప్‌ను నేడు రామ్ చరణ్ విడుదల చేశాడు. దీనిపై ఓ ఫన్నీ కాన్వర్సేషన్ ఇద్దరి మధ్య నడిచింది.

కొమరం భీం నీళ్ల నుంచి ఆయుధాన్ని తీస్తున్న క్లిప్‌ను చెర్రీ విడుదల చేశాడు. ఈ క్లిప్‌కి ఇప్పటికే 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైక్స్ వచ్చాయి. కాగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరిట చెర్రీకి సంబంధించిన టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను ఈ సినిమా యూనిట్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే తాజాగా విడుదల చేసిన క్లిప్‌పై ఎన్టీఆర్, చెర్రీల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అభిమానులకు దీనికి విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు.

‘బ్రదర్ తారక్ నిన్ను టీజ్ చేయడానికి ఒకటి విడుదల చేస్తున్నాను.  కానీ, నీలా కాదు.. టైమ్ అంటే టైమ్‌కే విడుదల చేస్తా’ అని చెర్రీ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. దీనిని చూసిన తారక్.. చెర్రీ ట్వీట్‌కి కౌంటర్ ఇచ్చాడు. ‘‘బ్రో... నువ్వు ఓ విషయాన్ని గుర్తించాలి. ఇప్పటికే నువ్వు ఆల్రెడీ ఐదు నెలలు ఆలస్యం చేశావు. అయితే ఇప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగానే ఉండాలి.. ఎందుకంటే ఇది జక్కన్నతో వ్యవహారం.. ఏమైనా జరగొచ్చు. ఏది ఏమైతేనేమి.. నువ్వు రిలీజ్ చేసే టీజర్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా’’ అని చెప్పాడు.

More News

ప్రభాస్ సర్‌ప్రైజ్ వచ్చేసింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. రేపు ప్రభాస్ సర్‌ప్రైజ్ రాబోతోందని షూటింట్ స్పాట్ నుంచి నిన్న పూజా హెగ్డే ఓ వీడియోను విడుదల చేసిన

ట్రెండింగ్‌లో ప్రభాస్ సీడీపీ.. సర్‌ప్రైజ్ అంటున్న పూజా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు మరో రెండు రోజుల్లో రాబోతోంది. దీని కోసం ప్రభాస్ అభిమానులు ఇప్పటికే సిద్ధమయ్యారు. క్యాజువల్‌గా అయితే కేక్ కటింగ్‌లు, రక్తదానాలు

సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ కోటి విరాళం

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని ప్రతి ప్రాంతంలోని ఎంతో కొంత భాగం నీట మునిగింది. ఇక పాతబస్తీ అయితే చాలా వరకూ జల దిగ్బంధంలో ఉండిపోయింది.

పవన్ రూ.కోటి విరాళం

ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని ఏరియాలన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి.

అష్ట దిగ్భంధనం ముగిసింది.. కరోనా కథ ముగియలేదు: మోదీ

కోవిడ్ మహమ్మారిని లైట్‌గా తీసుకోవద్దని భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నేడు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.