Ram Charan:ఢిల్లీలో రామ్‌చరణ్‌కు ఘనస్వాగతం.. నేడు ప్రధాని మోడీతో వేదిక పంచుకోనున్న చెర్రీ, చిరు సత్కారం కూడా..!!

  • IndiaGlitz, [Friday,March 17 2023]

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ రావడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి తెలుగు సినిమాపై పడింది. అలాగే రాజమౌళి, ఎన్టీఆర్ , రామ్‌చరణ్‌ల స్టార్‌డమ్ సైతం శిఖరాగ్రాన్ని చేరింది. ఈ వేడుక తర్వాత ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం హైదరాబాద్‌కు తిరిగి వచ్చేయగా.. చరణ్ మాత్రం న్యూఢిల్లీలో దిగారు. అక్కడ ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆర్ఆర్ఆర్ బ్యానర్లు, చరణ్ ఫ్లెక్సీలతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నిండిపోయింది. ఈ సందర్భంగా చెర్రీ మీడియాతో మాట్లాడుతూ.. తాను చాలా సంతోషంగా వున్నానని అన్నారు. కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్‌లను చూసి తాము గర్విస్తున్నామని.. వారి కారణంగానే రెడ్ కార్పెట్‌పై వెళ్లి భారతదేశానికి ఆస్కార్ తీసుకురాగలిగామని చరణ్ పేర్కొన్నారు. నాటు నాటు ఇండియన్ సాంగ్ అని ఆయన వెల్లడించారు.

మోడీ, సచిన్‌లతో కలిసి కూర్చోనున్న చరణ్ :

ఇప్పటికే ఆస్కార్ రావడంతో మంచి జోష్‌లో వున్న చరణ్‌‌కు మరో అరుదైన ఘనత దక్కింది. ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన ఒకే వేదికను పంచుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న ‘ఇండియా టుడే కాంక్లేవ్’ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, జాన్వీ కపూర్, మలైకా అరోరాలు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం సందర్భంగా చరణ్‌ను మోడీ సత్కరిస్తారని సమాచారం. అనంతరం ఆయన ప్రసంగం కూడా వుంటుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడంతో రామ్‌చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ఈ క్రమంలో హాలీవుడ్ నుంచి కూడా ఆయనకు సినిమా ఆఫర్లు వస్తున్నాయని ఫిలింనగర్ టాక్.

శరవేగంగా ఆర్సీ 15 షూటింగ్ :

ఇక సినిమాల విషయానికి వస్తే.. తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఆర్‌సీ 15 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చి 27న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

More News

స్వప్నలోక్ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణం , నోటీసులిచ్చినా మారని యాజమాన్యం

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

swapnalok complex : సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

సికింద్రాబాద్‌లో మరో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

Custody:చావు ఎటు నుంచైనా రావొచ్చు .. కానీ నిజం నా కస్టడీలోనే : ఆసక్తికరంగా ‘‘కస్టడీ’’ టీజర్, మాస్ లుక్‌లో చైతూ

థాంక్యూ, లాల్ సింగ్ చద్దాలు నిరాశ పరచడంతో అక్కినేని వారసుడు నాగచైతన్యకు అర్జెంట్‌గా ఒక హిట్ పడాలి.

MLC Elections : నాలుగు స్థానిక సంస్థల కోటా స్థానాల్లో వైసీపీ ఘన విజయం.. !!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 4 స్థానాల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది.

AP Budget: 2 లక్షల  79  వేల కోట్లతో  ఏపీ  బడ్జెట్‌.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..?

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.