close
Choose your channels

బోయపాటి రామ్ చరణ్ ల ఫస్ట్ లుక్ అదిరిందిగా

Tuesday, November 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బోయపాటి రామ్ చరణ్ ల ఫస్ట్ లుక్ అదిరిందిగా

ఊర మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ చరణ్ ఎడమ చేతిలో భారీ కత్తిని పట్టుకొని... కుడి చేతితో గాల్లో తిరుగుతున్న పెద్ద తుపాకిని పట్టుకొని శత్రువుల మీదకు పరుగెత్తుకుంటూ వస్తున్నాడు.

ఈ స్టీల్ చూస్తుంటే బోయపాటి రామ్ చరణ్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే చాలా అంచనాలున్న ఈ చిత్రం పై తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో భారీగా అంచనాలు పెరిగాయి.

అలాగే ఈ చిత్రానికి 'వినయ విధేయ రామ' గా టైటిల్ ని మేకర్స్ ఫైనల్ చేశారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ అందాల తార కైరా అద్వానీ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.