రెగ్యులర్‌ షూటింగ్‌లో రామ్‌చరణ్‌, బోయపాటి భారీ చిత్రం

  • IndiaGlitz, [Friday,January 19 2018]

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయ్యింది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా ...

చిత్ర నిర్మాత దానయ్య డి.వి.వి మాట్లాడుతూ - ''మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కలయికలో సినిమా అనగానే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఓ ఎక్స్‌పెక్టేషన్‌ ఉంటుంది. సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. హీరోలను ఎక్స్‌ట్రార్డినరీగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు బోయపాటి శ్రీను... అద్భుతమైన కథతో రామ్‌చరణ్‌ను సరికొత్త రీతిలో చూపించనున్నారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందించబోతున్నాం.

బాలీవుడ్‌ హీరోయిన్‌ కైరా అద్వాని ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళ నటుడు ప్రశాంత్‌, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం.. రిషి పంజాబి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈరోజు (శుక్రవారం) నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ నెలాఖరు వరకు మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది. ఫిబ్రవరిలో సెకండ్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. మెగాభిమానులు, ప్రేక్షకులు అంచనాలకు ధీటుగా సినిమాను రూపొందిస్తాం'' అన్నారు.

రామ్‌చరణ్‌, కైరా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, స్టిల్స్: జీవన్, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరామెన్‌: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్, కో-ప్రొడ్యూసర్: డి. కళ్యాణ్, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

More News

డ‌బ్బింగ్ చెప్పుకున్న ర‌ష్మిక‌

న‌వ‌త‌రం క‌థానాయిక‌లు త‌మ పాత్ర‌ల‌కి తామే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్యా మీన‌న్ లాంటి క‌థానాయిక‌లు అయితే.. కేవ‌లం త‌మ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా త‌మ స‌హ‌న‌టికి కూడా డ‌బ్బింగ్ చెప్పిన సంద‌ర్భాలున్నాయి.

హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో సాయిధ‌ర‌మ్ చిత్రం

సుప్రీమ్ త‌రువాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేక‌పోయాయి. ప్రస్తుతం వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'ఇంటెలిజెంట్' చిత్రాన్ని చేస్తున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. లావణ్య త్రిపాఠి నాయికగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఆచారి అమెరికా యాత్ర' జనవరి 26 న విడుదల

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానున్నది.

ప్రముఖ దర్శక నిర్మాత చేతుల మీదుగా 'కార్తిక' మూవీ పోస్టర్‌ విడుదల

మచెందర్‌ నట్టల నిర్మాణంలో కొత్త పరశురామ్‌ దర్శకత్వంలో బేబి అవంతిక ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'కార్తిక'. విజయ్‌భాస్కర్‌రెడ్డి, ప్రియాంక శర్మ, సింధు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టĸ

'భాగ‌మ‌తి' నిడివి

'బాహుబ‌లి - ది కంక్లూజ‌న్' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత అనుష్క క‌థానాయిక‌గా వ‌స్తోన్న‌ చిత్రం 'భాగ‌మ‌తి'.  'పిల్ల జ‌మీందార్' ఫేమ్ అశోక్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేష‌న్స్ నిర్మించింది. మ‌ల‌యాళ న‌టులు ఉన్ని ముకుంద‌న్‌, జ‌య‌రామ్‌, ఆశా శ‌ర‌త్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.