రామ్ చరణ్ నటనకి పదేళ్లు

  • IndiaGlitz, [Thursday,September 28 2017]

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడుగా తెరంగేట్రం చేసిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నాడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. చిరు త‌న‌యుడుగా 'చిరుత' పేరుతో సినిమా చేసి.. తెలుగు తెర‌పై తొలి అడుగులు వేసిన చ‌ర‌ణ్‌.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రామ్‌చ‌ర‌ణ్ మొద‌టి సినిమా 'చిరుత' స‌రిగ్గా ఇదే సెప్టెంబ‌ర్ 28న విడుద‌లైంది. విశేషమేమిటంటే.. ద‌ర్శ‌కుడి పూరీ పుట్టిన‌రోజు కూడా అదే రోజు కావ‌డం.

సి.అశ్వ‌నీద‌త్ నిర్మించిన ఈ చిత్రంతో నేహా శ‌ర్మ క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతంలో అన్ని పాట‌లు సూప‌ర్ హిట్టే. 2007లో విడుద‌లైన 'చిరుత' నేటితో ప‌ది సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటోంది. అంటే రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌కి ప‌దేళ్లు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌. ప్రస్తుతం సుకుమార్‌తో 'రంగ‌స్థ‌లం' చేస్తున్న చ‌ర‌ణ్‌.. భ‌విష్య‌త్‌లో 'మ‌గ‌ధీర' లాంటి ఘ‌న‌విజ‌యాలు మ‌రిన్ని అందుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

More News

పూరి 'మెహబూబా'

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి 'మెహబూబా' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. పూరి తనయుడు ఆకాష్ పూరి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

కాజ‌ల్ కి క‌లిసి రాలేదు.. మ‌రి నాగ‌చైత‌న్య‌కి?

స‌ఖి, చెలి, ర‌న్ వంటి విజ‌య‌వంత‌మైన త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగువారికి ద‌గ్గ‌రైన త‌మిళ క‌థానాయ‌కుడు మాధ‌వ‌న్‌. వీటితో పాటు ప‌ర‌వ‌శం, డుమ్ డుమ్ డుమ్‌, అమృత‌, యువ వంటి అనువాద చిత్రాల‌తోనూ ప‌ల‌క‌రించాడాయ‌న‌.

ఇద్ద‌రిలో ఎవ‌రు మురిపిస్తారో?

త‌మ‌న్నా, కాజ‌ల్‌.. ఒకే టైమ్‌లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో అగ్ర తార‌లుగా పేరు తెచ్చుకున్నారు. అయితే విశేషంగా ఇప్ప‌టివ‌ర‌కు  ఈ ఇద్ద‌రు ఒకే సినిమాలో క‌లిసి న‌టించిన సంద‌ర్భాలు లేవు.

స‌మంత అభిమానుల‌కి పండ‌గే

అక్టోబ‌ర్ 2017.. స‌మంత‌కి, ఆమె అభిమానుల‌కి వెరీ స్పెష‌ల్‌. ఎందుకంటే.. ఆ నెల ఆరో తేదిన యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌ని పెళ్లి చేసుకోబోతుంది స‌మంత‌.

స్టూడెంట్ నెం.1కి 16 ఏళ్లు

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో నెం.1 డైరెక్ట‌ర్ ఎవ‌రంటే.. ఎవ‌రైనా తడుముకోకుండా చెప్పే పేరు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అనే. అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న ఈ ద‌ర్శ‌క‌మౌళి ద‌ర్శ‌క‌ప్ర‌స్థానం మొద‌లైంది 2001లో వ‌చ్చిన స్టూడెంట్. నెం 1 సినిమాతోనే.