నాయనా..రామ్ చరణ్ ఏమిటి ఈ కన్ ఫ్యూజన్..?

  • IndiaGlitz, [Friday,July 29 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క‌త్తిలాంటోడు, ఖైదీ నెంబ‌ర్ 150, నెపోలియ‌న్...ఇలా ర‌క‌ర‌కాల‌ టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే...ఇటీవ‌ల ఫేస్ బుక్ వీడియో చాట్ లో రామ్ చ‌ర‌ణ్ నాన్న‌గారి 150వ చిత్రానికి క‌త్తిలాంటోడు టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ కాదు.
క‌థ‌కు త‌గ్గ టైటిల్ కోసం చూస్తున్నాం. త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేస్తాం అని తెలియ‌చేసారు. దీంతో అటు అభిమానులు ఇటు ఇండ‌స్ట్రీ.. చిరు 150వ చిత్రానికి క‌త్తిలాంటోడు టైటిల్ కాద‌ని ఫిక్స్ అయ్యారు. ఇంత‌లో స‌డ‌న్ గా రామ్ చ‌ర‌ణ్ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై క‌త్తిలాంటోడు టైటిల్ రిజిష్ట‌ర్ చేసారు. క‌త్తిలాంటోడు టైటిల్ కాద‌ని చెప్పిన చ‌ర‌ణే... ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించ‌డంతో ఫ్యాన్స్ తెగ క‌న్ ఫ్యూజ్ అవుతున్నార‌ట‌. మ‌రి.. ఈ కన్ ఫ్యూజ‌న్ కి చ‌ర‌ణ్‌ క్లారిటీ ఎప్పుడు ఇస్తాడో..?

More News

మహేష్ మూవీ మొదలైంది..

సూపర్ స్టార్ మహేష్-క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్నభారీ చిత్రం ఈరోజు ప్రారంభమైంది.

తేజ్ తిక్క ఆడియో హక్కులను కైవసం చేసుకున్న ఆదిత్యా మ్యూజిక్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా ,లారిస్సా బోనేసి హీరోయిన్ గా నటించిన చిత్రం తిక్క.

అత్యధిక ఓపెనింగ్స్ తో జక్కన్న

సునీల్ హీరోగా,మన్నార్ చోప్రా హీరోయిన్ గా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం జక్కన్న.

తేజు తిక్క ఆడియో ఫంక్షన్ హైలెట్స్ ఇవే...

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్,మన్నార చోప్రా,లెరిస్సా బొనేసి హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం తిక్క.

మామ ఆశీర్వాదంతో ఆనందంలో అల్లుడు..

మామ ఆశీర్వాదంతో ఆనందంలో అల్లుడు...అనగానే ఆ మామ-అల్లుడు ఎవరో ఇప్పటికే తెలిసింది కదూ..!