క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌కు రామ్‌చ‌ర‌ణ్ రూ.70 ల‌క్షలు విరాళం

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు చేతనైన సహాయాన్ని అందిస్తున్నారు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.క‌రోనా నిర్మూల‌న‌కు రూ.70 ల‌క్షలు విరాళ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ తొలి ట్వీట్ చేశారు.

‘‘పవన్ కల్యాణ్‌గారి ట్వీట్ చూసి స్ఫూర్తి పొందాను. కరోనా(కోవిడ్ 19) నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.70 లక్షల రూపాయలను అందిస్తున్నాను. కరోనా నివారణకు గౌరవనీయులైన ప్రధాని మంత్రి నరేద్రమోదీగారు, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌గారు, జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిగారు తీసుకుంటున్న చ‌ర్య‌లు ప్ర‌శంస‌నీయం. బాధ్య‌త గ‌ల పౌరుడిగా ప్ర‌భుత్వాలు సూచించిన నియ‌మాల‌ను పాటించాల‌ని కోరుతున్నాను’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు రామ్‌చ‌ర‌ణ్‌.

క‌రోనా నిర్మూల‌న‌కు రూ.70 లక్ష‌లు విరాళం ఇచ్చినందుకు రామ్‌చ‌ర‌ణ్‌కు త‌న బాబాయ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ట్విట్ట‌ర్ ద్వారా హృద‌య పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు.

More News

కరోనాపై యుద్ధం.. పవన్ కల్యాణ్ భారీ విరాళం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా

లారెన్స్ హీరోగా కొత్త చిత్రం

రాఘ‌వ లారెన్స్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమంటే.. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’ త‌మిళ రీమేక్‌గా రూపొంద‌నున్న చిత్ర‌మిది.

కరోనా నేపథ్యంలో ఇటలీలో తెలుగు గాయనికి నరకం!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తొలి ట్వీట్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉగాది సంద‌ర్భంగా తాను సోషల్ మీడియాలోకి ఎంట‌ర్ అవుతున్నాన‌ని ఆయ‌న తెలియ‌జేసిన సంగ‌తి

'ఆర్ ఆర్ ఆర్' అంచ‌నాల‌ను పెంచేస్తున్న మోష‌న్ పోస్ట‌ర్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.