Ram Charan:‘వి మెగా పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌పై యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తోన్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Thursday,May 25 2023]

ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRతో వ‌ర‌ల్డ్ వైప్ పాపులారిటీ ద‌క్కించుకున్నారు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఆయ‌న యువీ క్రియేష‌న్స్‌లోని త‌న స్నేహితుడు విక్ర‌మ్ రెడ్డితో చేతులు క‌లిపారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను, యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వీరిద్దరూ ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్‌ను ప్రారంభించారు. పాన్ ఇండియా ప్రేక్ష‌కులు మెచ్చేలా విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను ఈ సంస్థ రూపొందించ‌నుంది. అదే స‌మ‌యంలో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వేదిక‌గా మారుతుంది.

నిర్మాణ సంస్థ ‘వి మెగా పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌లో విల‌క్ష‌ణ‌మైన క‌థాంశాల‌తో పాటు తిరుగులేని వినోదాన్ని ప్రేక్ష‌కులకు అందిచంటానికి సిద్ధంగా ఉంది. సినీ నిర్మాణంలో అసాధార‌ణ‌మైన ఆస‌క్తి తో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌దనాన్ని అందించాల‌నే ఆలోచ‌న ఉన్న టీమ్ ఆధ్వ‌ర్యంలో ఈ నిర్మాణ సంస్థ ముందుకు సాగ‌నుంది. సినీ ప‌రిశ్ర‌మలో ఎవ‌రూ గుర్తించ‌ని ప్ర‌తిభ‌ను గుర్తించి ప్రోత్స‌హించాల‌నే దానికి క‌ట్టుబ‌డి ఉంది.

ఈ సంద‌ర్బంగా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘మా ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ విలక్ష‌ణ‌మైన ఆలోచనలను ఆవిష్క‌రిస్తూ స‌రికొత్త‌, వైవిధ‌మ్యైన వాతావ‌ర‌ణాన్ని పెంపొందించ‌టానికి సిద్దంగా ఉన్నాం. సృజ‌నాత్మ‌క‌త‌తో సినిమా స‌రిహ‌ద్దుల‌ను చెరిపేస్తాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసి ఓ స‌రికొత్త ప్ర‌భావాన్ని చూపించ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాం’’ అన్నారు.

యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ ‘‘ఈ స‌రికొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌టం అనేది మాలో తెలియ‌ని ఆనందాన్ని క‌లిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో క‌లిసి వి మెగా పిక్చ‌ర్స్ ప‌ని చేయ‌నుంది. వెండితెర‌పై చూపించ‌బోయే స్టోరీ టెల్లింగ్‌లో ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకు రావాల‌నుకుంటున్నాం. దీని వ‌ల్ల సినీ ఇండ‌స్ట్రీ హ‌ద్దులు చెరిపేయ‌ట‌మే మా ల‌క్ష్యం’’ అన్నారు.

More News

Ramya Raghupathi:నరేష్ - పవిత్రా లోకేష్‌లకు షాక్  : 'మళ్లీ పెళ్లి' రిలీజ్‌ను అడ్డుకోండి .. కోర్టుకెక్కిన రమ్య రఘుపతి

సీనియర్ నటులు నరేష్, పవిత్రా లోకేష్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘మళ్లీ పెళ్లి’’ . ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Comedian Sudhakar : ఆ వార్తలు నమ్మొద్దు.. నేను క్షేమంగా వున్నా : కమెడియన్ సుధాకర్

సోషల్ మీడియా రాకతో ప్రతి వార్తా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇదే సమయంలో ఏది నిజమో,

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో

Tiger Nageswara Rao:‘‘పులుల్ని వేటాడే పులిని చూశావా ’’: గజదొంగగా భయపెడుతోన్న రవితేజ , 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్ గ్లింప్స్ సూపర్బ్

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ మంచి జోరులో వున్నారు. 50 ప్లస్‌లోనూ కుర్ర హీరోల కంటే స్పీడుగా సినిమాలు చేస్తున్నారు.

White House:అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర.. వైట్‌హౌస్‌లోకి ట్రక్కుతో చొచ్చుకెళ్లే యత్నం, తెలుగు యువకుడు అరెస్ట్

ప్రపంచాన్ని కనుసైగతో శాసించే అగ్రరాజ్యాధినేత, అమెరికా అధ్యక్షుడికి ఏ స్థాయిలో భద్రత వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.