పరేషాన్ అవుతున్న చరణ్ ఫాన్స్

  • IndiaGlitz, [Tuesday,November 29 2016]

బాబాయ్ ప‌వ‌న్ ప్లాప్ మూవీ రిలీజ్ రోజునే అబ్బాయ్ మూవీ రిలీజ్ చేస్తున్నారు. అబ్బాయ్ చ‌ర‌ణ్ మూవీ తెలిసిందే ధృవ‌. మ‌రి...బాబాయ్ ప‌వ‌న్ ఫ్లాప్ మూవీ ఏమిటంటారా..? పంజా. త‌మిళ డైరెక్ట‌ర్ విష్ణువ‌ర్ధ‌న్ తెర‌కెక్కించిన పంజా చిత్రం 2011 డిసెంబ‌ర్ 9న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ధృవ చిత్రాన్ని ముందుగా డిసెంబ‌ర్ 2న రిలీజ్ చేయాలి అనుకున్నా....ఆఖ‌రికి డిసెంబ‌ర్ 9న‌ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ విష‌యం తెలిసి కొంత మంది చ‌ర‌ణ్ ఫ్యాన్స్ డిసెంబ‌ర్ 9 బాబాయ్ కి ఫ్లాప్ ఇచ్చింది. ఈసారి అబ్బాయ్ చ‌ర‌ణ్ కి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో అని ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. పంజా సినిమాకి త‌మిళ డైరెక్ట‌ర్ వ‌ర్క్ చేస్తే....ధృవ చిత్రం త‌మిళ్ చిత్రానికి రీమేక్ కావ‌డం విశేషం. అనుకోకుండా జ‌రిగిన బాబాయ్ - అబ్బాయ్ ల డిసెంబ‌ర్ 9 రిలీజ్ కొంచెం ఇష్టంగా కొంచెం క‌ష్టంగా అనిపిస్తుంది. మ‌రి...ఫ‌లితం ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబ‌ర్ 9 వ‌ర‌కు ఆగాల్సిందే..!

More News

చైతు ఈ మూవీ కూడా చేయ‌డం లేద‌ట‌..!

అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారు.

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసంటున్న కేంద్ర‌మంత్రి..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందించిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.

ఎన్టీఆర్ - బాబీ మూవీకి అడ్డుగా అభిషేక్ బ‌చ్చ‌న్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఏ సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం పై చాలా మంది డైరెక్ట‌ర్స్ పేర్లు తెర పైకి వ‌చ్చాయి. ఫైన‌ల్ గా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ బాబీ ని క‌న్ ఫ‌ర్మ్ చేసార‌ని స‌మాచారం.

డిసెంబర్ 4న గ్రాండ్ లెవల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ `ధృవ`. మెగాపవర్స్టార్ రాంచరణ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్పై సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్రకటించిన రోజు నుండే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చేసిన ప‌నికి ప‌వ‌న్ అభినంద‌న‌లు..!

500, 1000 నోట్ల ర‌ద్దు చేయ‌డంతో ప్ర‌జ‌లు ఎంత ఇబ్బంది ప‌డుతున్నారో తెలిసిందే.  ఇక‌ హాస్ప‌ట‌ల్స్ లో ఉన్న రోగుల కుటుంబ స‌భ్యులు అయితే... నోట్ల ర‌ద్దుతో చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు.