close
Choose your channels

త‌మిళంలోకి రామ్‌చ‌ర‌ణ్ చిత్రం

Monday, November 4, 2019 • తెలుగు Comments

త‌మిళంలోకి రామ్‌చ‌ర‌ణ్ చిత్రం

బాహుబ‌లి త‌ర్వాత తెలుగు సినిమాకు భారీ విజ‌యాన్ని అందించాడు హీరో రామ్‌చ‌ర‌ణ్‌. చెర్రీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `రంగ‌స్థ‌లం`. ఈ సినిమా సెన్సేష‌న‌ల్ విజయాన్ని సాధించి రూ. 200 కోట్ల మేర వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్పుడు ఈ సినిమా త‌మిళంలో రీమేక్ కానుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌బోయే ఈ చిత్రంలో రాఘ‌వ లారెన్స్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు. ద‌ర్శ‌కుడు లింగుస్వామి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడ‌ని స‌మాచారం. `రంగ‌స్థ‌లం` చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ చెవులు విన‌ప‌డ‌ని వ్య‌క్తిగా న‌టించారు. రామ్‌చ‌ర‌ణ్‌కు న‌ట‌న ప‌రంగా మంచి పేరుని తెచ్చిపెట్టిన చిత్ర‌మిది.

రివేంజ్ డ్రామా 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కింది. ఈ సినిమా కోసం స్పెష‌ల్ సెట్‌ను వేసి అందులో ఎక్కువ భాగాన్ని చిత్రీక‌రించారు. ఆది పినిశెట్టి కీల‌క పాత్ర‌లో న‌టించారు. స‌మంత హీరోయిన్‌గా న‌టించింది. మ‌రిప్పుడు త‌మిళంలో హీరోయిన్ ఎవ‌రు న‌టిస్తారు. ఆది పినిశెట్టి పాత్ర‌ను ఎవ‌రు చేస్తార‌నే సంగ‌తి తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. ప్రస్తుతం లారెన్స్ బాలీవుడ్‌లో కాంచ‌న సీక్వెల్ ల‌క్ష్మీ బాంబ్‌ను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా కార్య‌క్ర‌మాలు పూర్తి కాగానే లారెన్స్ రంగ‌స్థ‌లం రీమేక్‌లో న‌టిస్తార‌ట‌.

Get Breaking News Alerts From IndiaGlitz