close
Choose your channels

‘ఆచార్య‌’ను పూర్తి చేసిన చెర్రీ..!

Saturday, March 6, 2021 • తెలుగు Comments

‘ఆచార్య‌’ను పూర్తి చేసిన చెర్రీ..!

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆచార్య‌’. సినిమాను మే 13న విడుద‌ల చేయ‌బోతున్నట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు. అందుకు అనుగుణంగా సినిమాను పూర్తి చేస్తున్నారు కొర‌టాల అండ్ టీమ్‌. చిరంజీవి గ్యాప్ తీసుకోకుండా సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజి బిజీగా ఉన్నారు. సినిమాలో సిద్ధ అనే కీల‌క పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏక‌ధాటిగా 20 రోజుల పాటు రామ్‌చ‌ర‌ణ్ ‘ఆచార్య‌’ షూటింగ్‌లో పాల్గొన్నారు. కోకాపేట‌లో వేసిన భారీ టెంపుల్ సెట్‌తో పాటు, రాజ‌మండ్రి మారేడుమిల్లి ప్రాంతంలో జ‌రిగిన షూటింగ్‌లో చ‌ర‌ణ్ పాల్గొన్నాడు. ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

రీసెంట్‌గా రామ్‌చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేల‌పై మాంటేజ్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌తో ‘ఆచార్య‌’లో చ‌ర‌ణ్ పార్ట్ పూర్త‌య్యిందని వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే రామ్‌చ‌ర‌ణ్ జోడీగా న‌టిస్తోన్న పూజా హెగ్డే పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది. సినిమాలో పూజా పాత్ర ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాలు మాత్ర‌మే ఉంటుంది. దీనికి పూజా హెగ్డే రెండు కోట్ల రూపాయ‌ల‌ను తీసుకుంద‌ని టాక్‌. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న 152వ చిత్రమిది.

Get Breaking News Alerts From IndiaGlitz