చెర్రీ భ‌య్యా... ద‌స‌రాకేనా?

  • IndiaGlitz, [Monday,September 24 2018]

రామ్‌చ‌ర‌ణ్... ద‌స‌రాకు విడుద‌ల చేస్తారు అని అన‌గానే అంద‌రికీ రెండు అనుమానాలు వ‌స్తాయి. వాటిలో ఒక‌టి 'సైరా'కి సంబంధించిందేనా? రెండోది బోయ‌పాటి సినిమా ఫ‌స్ట్ లుక్కా? మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డేకి, అంత‌కు ముందు కూడా 'సైరా' లుక్స్ విడుద‌ల చేశారు.

తాజాగా ద‌స‌రాకు మాత్రం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. యాక్ష‌న్ బేస్డ్ సినిమాల‌ను ప‌క్కాగా రూపొందించే బోయపాటి త‌న హీరోల ఫ‌స్ట్ లుక్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.

ఒక్క‌గానొక్క లుక్కుతోనే ఆయ‌న సినిమాపై అంచ‌నాలు పెరిగేలా చేస్తాడు. తొలిసారి రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఆయ‌న సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఎలా ఉండ‌బోతుందోన‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ నాయిక‌. దాన‌య్య నిర్మాత‌.