రామ్‌చ‌ర‌ణ్‌ హీరోయిన్ ఇప్పుడు బన్నీకి స్పెషల్

  • IndiaGlitz, [Friday,April 10 2020]

టైటిల్ చ‌దివిన త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌ హీరోయిన్ ఇప్పుడు బన్నీకి స్పెషలేంటి అనే సందేహం రావ‌చ్చు. వివ‌రాల్లోకెళ్తే డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌లో బ‌న్నీ స‌ర‌స‌న పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ భామ త‌దుప‌రి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ హీరోగా రూపొందిన‌ సినిమా రంగ‌స్థ‌లంలో స్పెష‌ల్ సాంగ్‌లో నటించింది. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఇప్పుడు బ‌న్నీ, సుకుమార్ సినిమా పుష్ప‌లో ఓ స్పెష‌ల్‌సాంగ్ కోసం హీరోయిన్ కియారా అద్వానీని సంప్ర‌దించాల‌నుకుంటున్నట్లు స‌మాచారం. ఈ అమ్మ‌డు అంత‌కు ముందు చ‌ర‌ణ్ సినిమా విన‌య‌విధేయ‌రామ‌లో హీరోయిన్‌గా న‌టించింది. అంటే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ హీరోయిన్ చ‌ర‌ణ్‌కు స్పెష‌ల్ అయితే.. ఇప్పుడు చ‌ర‌ణ్ హీరోయ‌న్ బ‌న్నీకి స్పెష‌ల్ అవుతుందని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. పుష్ప పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల కానుంది. కాబ‌ట్టి కియారా అద్వానీ స్పెష‌ల్ సాంగ్ న‌టించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి.

ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం పుష్ప‌. చిత్తూరుజిల్లా శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

More News

కన్న‌డ‌లో రీమేక్‌కానున్న అడివి శేష్ చిత్రం..?

ఈ మ‌ధ్య తెలుగు సినిమాల ట్రెండ్ మారింది. డిఫరెంట్ సినిమాలు రూపొందుతున్నాయి. కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయ‌డానికి హీరోలు, చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపుతున్నారు.

లేడీ విలన్‌తో బాలయ్య ఢీ..?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తానంటోన్న రానా !!

రానా ద‌గ్గుబాటి హీరోగా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా రాణిస్తున్నారు. ఇటీవ‌ల కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

అందుకే సినిమాల‌కు దూర‌మ‌య్యానంటున్న శ్రీముఖి

బుల్లితెర‌, వెండితెర‌కు ఒక‌ప్పుడు దూరం ఎక్కువ‌గా ఉండేది. వెండితెర‌పై డీగ్లామ‌ర్ అయిన వారే బుల్లి తెర‌పై క‌నిపించ‌డానికి ఆస‌క్తి చూపేవారు.

క‌రోనాపై పోరుకు మ‌హేశ్ కొత్త ఆలోచ‌న‌..!!

కోవిడ్ 19 ప్ర‌భావంతో ప్ర‌పంచం ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోయింది. అన్నీ రంగాలు స్తబ్దుగా అయిపోవడం అభివృద్ధి ఆగిపోయింది. ఉన్న‌త, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం