close
Choose your channels

రామ్‌చ‌ర‌ణ్‌కి ఏమీ కాలేదు

Wednesday, July 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్‌చ‌ర‌ణ్‌కి ఏమీ కాలేదు

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు `RRR` షూటింగ్‌లో మ‌ళ్లీ గాయ‌మైందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేద‌ని, ఆయ‌న `RRR`షూటింగ్‌లో కూడా పాల్గొన్నార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలియ‌జేశాయి. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ జిమ్ చేస్తుండగా కాలికి గాయ‌మైంది. దాంతో `RRR` షూటింగ్ మూడు వారాల పాటు వాయిదా ప‌డింది. మ‌ళ్లీ ఇప్పుడు మ‌రోసారి గాయ‌మైందా? అని మెగాభిమానులు కంగారు ప‌డ్డారు. అయితే చ‌ర‌ణ్ స‌న్నిహిత వ‌ర్గాలు ఆ వార్త‌ల‌ను కొట్టిపారేశాయి.

రూ.300కోట్ల పైగా భారీ బడ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమాను రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపిస్తే.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపిస్తారు. అజ‌య్‌దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.