'రణరంగం' సౌండ్ కట్ ట్రైలర్ ను విడుదలచేసిన - రామ్ చరణ్

  • IndiaGlitz, [Monday,August 12 2019]

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. ఈ ఆగస్టు 15 న విడుదల అవుతున్న విషయం విదితమే. చిత్ర ప్రచారంలో భాగంగా 'రణరంగం' సౌండ్ కట్ ట్రైలర్ విడుదల అయింది.

'రణరంగం' చిత్రం సౌండ్ కట్ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు విడుదలచేశారు. రామ్ చరణ్ కు శర్వానంద్ మంచిమిత్రుడు. తన మిత్రుడి చిత్రం సౌండ్ కట్ ట్రైలర్ ను చూసిన అనంతరం ఆయన స్పందిస్తూ...'సూపర్బ్..సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగావుంది.టెర్రిఫిక్ గా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. మళ్ళీ శర్వానంద్ ని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలావుంది. పర్ఫెక్ట్ గా ఉంది. శర్వా లో ఉన్నది, మాకు నచ్చింది. అతనిలో ఉన్న ఇంటెన్సిటీ. అతని చిత్రాల్లో కో అంటే కోటి చిత్రం నాకిష్టం.

అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాడిని. ఇప్పుడీ రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ ను చూసిన తరువాత అలాంటి చిత్రం అనిపించింది. దర్శకుడు సుధీరవర్మ ఈ చిత్రం తో తన ప్రతిభను మళ్ళీ నిరూపించుకున్నారనిపించింది. చాలా మంచి ప్లాట్ ఉన్న చిత్రం. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా బాగున్నాయి. ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టెర్రిఫిక్ గా ఉంది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుండటం తో పాటు కొత్తగా ఉంది. డెఫినెట్ గా చిత్రం విజయం సాధించాలని చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు రామ్ చరణ్. ఈకార్యక్రమంలో చిత్ర కథానాయకుడు శర్వానంద్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు.

More News

కెజిఫ్ రికార్డు బ్రేక్ చేసిన కన్నడ సూపర్ స్టార్ దర్శన్ 'కురుక్షేత్రం 3D'

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ దుర్యోధనుడు గా నటించిన కురుక్షేత్రం, తాజా గా విడుదలైన సంగతి తెలిసిందే,

'పండుగాడి ఫోటో స్టూడియో' మూవీ ఆడియో

ఆలీ మరోసారి హీరోగా పూర్తీ వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’.

నాగ్ విశ్వరూపం.. ‘ఫాల్తు’ పనులేంటి.. తమన్నా ఔట్!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ ఎపిసోడ్‌.. ఎపిసోడ్‌కు ఎక్కడికో వెళ్లిపోతోంది. షో ప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకూ హోస్ట్ నాగార్జున నవ్వుతూనే మాట్లాడారంతే.. అయితే మునుపెన్నడూ లేని విధంగా శనివారం జరిగిన

నాగ్ వర్సెస్ తమన్నా.. క్షమాపణ చెప్పించిన కింగ్!

బిగ్‌బాస్ హౌస్‌లో జర్నలిస్టులపై ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే శనివారం నాడు హౌస్‌లోకి ఎంటరైన కింగ్ నాగార్జున తమన్నాపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం

రామ్‌చరణ్‌కి అవార్డ్ రావాల్సిందన్న మంచు విష్ణు

మెగాపవర్ స్టార్ నటించిన `రంగస్థలం` తెలుగులో సెన్సేషనల్ హిట్ అయ్యింది. నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. రామ్‌చరణ్ నటన, సుకుమార్ టేకింగ్ సినిమాను మరో రేంజ్‌లో నిలిపాయి.