close
Choose your channels

చరణ్‌ రికార్డ్‌..!

Saturday, October 31, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చరణ్‌ రికార్డ్‌..!

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పేరిట ఓ రికార్డ్ సొంతమైందని మెగాభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంతకూ చరణ్‌ క్రియేట్‌ చేసిన రికార్డ్‌ ఏంటనే విషయం చూస్తే రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌తో పాటు మరో రెండు టీజర్‌లు విడుదలయ్యాయి. రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రదారిగా చరణ్‌ చేస్తున్నపాత్ర గురించి వివరిస్తూ ఎన్టీఆర్‌ వాయిస్‌లో భీమ్‌ ఫర్‌ రామరాజు.. అలాగే కొమురం భీమ్‌ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ను వివరిస్తూ చరణ్‌ వాయిస్‌ రామరాజు ఫర్‌ భీమ్‌ టీజర్స్‌ను జక్కన్న విడుదల చేశారు.

ఇందులో చరణ్‌ పాత్రకు సంబంధించిన రామరాజు ఫర్‌ భీమ్‌ టీజర్‌ టాలీవుడ్‌లో అత్యధికి వ్యూస్‌ రికార్డును క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు ఈ వీడియోను యూ ట్యూబ్‌లో 33.3 మిలియన్‌ మంది వీక్షించారు. కోవిడ్‌ నేపథ్యంలో రీసెంట్‌గా 'ఆర్‌ఆర్‌ఆర్‌' రీస్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. వచ్చే వారం బాలీవుడ్ స్టార్‌ ఆలియా భట్‌ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్‌ అవుతుందని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.