close
Choose your channels

‘ఆర్ఆర్ఆర్‌’ క్లైమాక్స్ షురూ..!

Wednesday, January 20, 2021 • తెలుగు Comments

‘ఆర్ఆర్ఆర్‌’ క్లైమాక్స్ షురూ..!

ప్రెస్టీజియ‌స్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’ కోసం ప్యాన్ ఇండియా ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఇద్ద‌రు పోరాట యోధుల‌కు సంబంధించిన క‌ల్పిత క‌థాంశంతో 1920, ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ఇది. ఇప్ప‌టికే ఎన‌బై శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేసుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌తో మేజ‌ర్ షూటింగ్ పార్ట్ పూర్త‌వుతుందని స‌మాచారం.

దాదాపు నాలుగువంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పై బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, కోలీవుడ్ స్టార్ స‌ముద్ర‌ఖ‌ని, హాలీవుడ్‌స్టార్ రే స్టీవెన్‌స‌న్‌, ఆలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఒక‌వైపు షూటింగ్ జ‌రుగుతుండ‌గా, మ‌రో వైపు వి.ఎఫ్‌.ఎక్స్ ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు జ‌క్క‌న్న అండ్ టీమ్‌.

Get Breaking News Alerts From IndiaGlitz