close
Choose your channels

బాబాయ్ పుట్టిన‌రోజున చెర్రీ

Tuesday, August 28, 2018 • తెలుగు Comments

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు బాబాయ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే ఎంతో ప్రేమ‌.. అభిమానం. అందుకు గుర్తుగా బాబాయ్ ప‌వ‌న్ పుట్టిన‌రోజు (సెప్టెంబ‌ర్ 2) సంద‌ర్భంగా.. త‌న సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌.. టైటిల్‌ను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట రామ్‌చ‌రణ్‌. బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న చెర్రీ..

ఆ సినిమాకు సంబంధించిన టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను సెప్టెంబ‌ర్ 2 న విడుద‌ల చేసి.. మూడో తారీఖున .. అజ‌ర్ బైజాన్ కు షూటింగ్ వెళ్ల‌నుంది చిత్ర యూనిట్‌. కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత డివివి.దాన‌య్య‌.