చ‌ర‌ణ్ జోడీ వ‌చ్చేసింది!

  • IndiaGlitz, [Tuesday,September 25 2018]

చ‌ర‌ణ్ జోడీ కొత్త‌గా రావ‌డ‌మేంటి? అని అనుకుంటున్నారా..? వ‌చ్చింది కొత్త‌గానే. కాక‌పోతే పాత సినిమాలోకే. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా అజ‌ర్‌బైజాన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ నాయిక‌. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్త‌యిపోతుంది. ఈ తాజా షెడ్యూల్లో ఇప్ప‌టిదాకా కియారా పాల్గొన‌లేదు. ఇప్పుడే ఆమె అక్క‌డికి చేరుకుంది.

కొన్ని స‌న్నివేశాలు, ఓ పాట‌లో న‌టించ‌నుంది. దీంతో సినిమా షూటింగ్ పూర్త‌వుతుంద‌ని వినికిడి. ద‌స‌రాకు ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తారు. అప్పుడే టైటిల్‌ను కూడా పెట్టాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. స్టేట్ రౌడీ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు. చిరంజీవి న‌టించిన సూప‌ర్ హిట్ సినిమా స్టేట్ రౌడీ. అదే టైటిల్‌ని పెడితే మెగా అభిమానుల‌కు మాత్రం నిజంగా పండుగే అవుతుంది.

More News

దేవ‌దాస్  సెన్సార్ పూర్తి, సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టించిన సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. 'U/A' స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది.

చెర్రీ భ‌య్యా... ద‌స‌రాకేనా?

రామ్‌చ‌ర‌ణ్... ద‌స‌రాకు విడుద‌ల చేస్తారు అని అన‌గానే అంద‌రికీ రెండు అనుమానాలు వ‌స్తాయి. వాటిలో ఒక‌టి 'సైరా'కి సంబంధించిందేనా?  రెండోది బోయ‌పాటి సినిమా ఫ‌స్ట్ లుక్కా?

'చంద్రోదయం' లో చంద్రబాబు లుక్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటేనె ఓ దూరదృష్టి ఉన్న దార్శనికుడు. తనదైన విజన్ తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలకొని ,నేటి అమరావతి సమేత ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 12న రాజేంద్ర‌ప్ర‌సాద్ 'బేవ‌ర్స్' చిత్రం విడుద‌ల‌

'ఆన‌లుగురు', 'మీ శ్రేయాభిలాషి' లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ ఎన్నో చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ షూటింగ్ పూర్తి..

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న అమ‌ర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ పూర్తైపోయింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో హీరో హీరోయిన్ల‌పై చివరి పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు.