Game Changer:'గేమ్‌ ఛేంజర్‌' నుంచి క్రేజీ అప్‌డేట్ : ఫోటో షేర్ చేసిన శంకర్, రాంచరణ్‌ నయా లుక్‌ వైరల్

  • IndiaGlitz, [Wednesday,October 11 2023]

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్‌తో ‘‘గేమ్ ఛేంజర్’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం చాలాకాలంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మధ్యలో ఆగుతూ, మళ్లీ తీస్తూ.. ఇలా సాగుతోంది గేమ్ ఛేంజర్ సినిమా. ఏకకాలంలో కమల్ హాసన్‌తో ఇండియన్ 2, ఇటు రామ్ చరణ్ మూవీ తీస్త రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. మంగళవారం ఇండియన్ 2 డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. కమల్ హాసన్‌తో శంకర్ దగ్గరుండి డబ్బింగ్ చెప్పించారు.

ఇంతలో ఓ వీడియో వైరల్ అయ్యింది. గేమ్ ఛేంజర్ లోకేషన్ నుంచి ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు శంకర్. ఇందులో చరణ్‌కు ఆయన ఓ సీన్ వివరిస్తున్నట్లుగా వుంది. నిన్నటి నుంచి గేమ్ ఛేంజర్ కోసం హైదరాబాద్‌లో ఎమోషనల్ సీన్లని రూపొందిస్తున్నామని శంకర్ తెలిపారు. కళ్ల జోడు పెట్టుకుని , క్లీన్ షేవ్‌తో ఆఫీసర్ లుక్‌లో స్మార్ట్‌గా కనిపిస్తున్నారు రామ్ చరణ్. అయితే ఒకేరోజు ఇండియన్ 2 డబ్బింగ్‌లో పాల్గొన్న శంకర్, సాయంత్రానికి గేమ్ ఛేంజర్ షూటింగ్‌లో పాల్గొనడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

ఇకపోతే.. హైదరాబాద్ శివార్లలోని ఓ చోట వేసిన స్పెషల్ సెట్‌లో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అంజలి, రామ్ చరణ్‌లపై ఎమోషనల్ సీన్లను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘‘గేమ్ ఛేంజర్’’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

More News

Lokesh:ముగిసిన లోకేశ్‌ సీఐడీ విచారణ.. రేపు మరోసారి రావాలని నోటీసులు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారణ ముగిసింది.

Telangana BJP: గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరనుందా..? కనీసం పోటీలో అయినా నిలుస్తుందా..?

రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరగడంతో బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది.

Nassar:తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు నాజర్ తండ్రి కన్నుమూత

తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తమిళ సీనియర్ నటుడు నాజర్ తండ్రి మెహబూబ్ బాషా(95) తుది శ్వాస విడిచారు.

YS Jagan: చంద్రబాబు అరెస్టుపై జగన్ వ్యాఖ్యలు వ్యూహమా..? బీజేపీని ఇరికించే ప్రయత్నమా..?

విజయవాడలో సోమవారం జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Telangana Congress: కాంగ్రెస్ ఈసారైనా అధికారంలోకి వస్తుందా..? కేసీఆర్‌ను ఢీ కొడుతుందా..?

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే ఆరు గ్యారంటీ హామీలతో జోష్ మీదున్న