Ram Charan:శర్వానంద్ రిసెప్షన్‌లో కళ్లన్నీ చెర్రీ మీదే .. రాంచరణ్ ధరించిన షర్ట్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

  • IndiaGlitz, [Saturday,June 10 2023]

ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ కావడం, దానికి ఆస్కార్ అవార్డ్ లభించడం తదితర కారణాలతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్టార్‌డమ్ శిఖరాగ్రాన్ని చేరుకుంది. నిన్న గాక మొన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొని తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు చరణ్. తొలి నుంచి ట్రెండీ వేర్‌లో స్టైలీష్‌గా కనిపించడానికి ఇష్టపడేవారు గ్లోబల్ స్టార్. సింపుల్‌గా కనిపించే బట్టలే ధరించినా అవి ఎంతో స్పెషల్ .. దటీజ్ రాంచరణ్. తాజాగా ఆయన మరోసారి తను ధరించిన దుస్తులతో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఉపాసనతో కలిసి శర్వానంద్ రిసెప్షన్‌‌కి చరణ్ :

వివరాల్లోకి వెళితే.. యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల ఇంటివాడైన సంగతి తెలిసిందే. ఈ నెల 3న జైపూర్‌లోని లీలా మహల్ ప్యాలెస్‌లో రక్షితా రెడ్డి మెడలో ఆయన మూడు ముళ్లు వేశారు. అయితే అభిమానులు, సినీ ప్రముఖులు, మీడియా కోసం నిన్న హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఇచ్చారు శర్వా - రక్షితా రెడ్డి దంపతులు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక తన బెస్ట్ ఫ్రెండ్ ఓ ఇంటి వాడు కావడతో రామ్ చరణ్‌‌ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. జైపూర్‌లో పెళ్లికి హాజరైన ఆయన.. రిసెప్షన్‌కి కూడా తన సతీమణి ఉపాసనతో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ వేసుకున్న లైట్ బ్లూ కలర్ షర్ట్‌పై అందరి కళ్లూ పడ్డాయి. వెంటనే దీని ధర ఎంత, ఏ కంపెనీ, ఎవరు డిజైన్ చేశారు అనే వివరాలపై ఆన్‌లైన్‌లో జల్లెడ పట్టేస్తున్నారు. చరణ్ ధరించిన షర్ట్‌ (Anagram debossed shirt in cotton) ఖరీదు అక్షరాల రూ.73,000 అట. ఆన్‌లైన్‌లో ఈ షర్ట్ రకరకాల మోడల్స్‌లో, కలర్స్‌లో అందుబాటులో వుంది. అయితే చరణ్ వేసుకున్న షర్ట్ ధర ఇన్ని వేల రూపాయాలా అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఆ డబ్బుతో మనం ఎన్ని బట్టలు కొనుక్కోవచ్చో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న చరణ్ :

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More News

Bhagavanth Kesari:భగవంత్ కేసరి  : ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది.. బాలయ్య మాస్ జాతర, టీజర్ చూశారా మరి

నటసింహం నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘‘భగవంత్ కేసరి’’.

AP CM YS Jagan:సీపీఎస్ రద్దు .. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్, ఆడక్కుండానే ఉద్యోగులకు మరిన్ని వరాలు

రెండ్రోజుల క్రితం జరిగిన ఏపీ కేబినెట్ భేటీపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. రెగ్యులర్‌గా జరిగేదే కదా అనుకున్నారంతా.

Chiranjeevi : చిరంజీవి మ‌ళ్లీ లీక్ చేసేశారు .. ఆ స్టెప్పులకు తమన్నా, కీర్తి ఫిదా.. మీరు చూశారా.?

లేటు వయసులో కుర్రాళ్లకు పోటీనిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వారి కంటే ఎక్కువగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Calling Sahastra:'కాలింగ్ సహస్త్ర' లో డిఫరెంట్ సుధీర్‌ని చూస్తారు: 'కలయా నిజమా..' సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్‌

అటు బుల్లి తెర ఇటు సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ సుడిగాలి సుధీర్‌.

Narendra Modi:మోడీ అమెరికా పర్యటన .. వాషింగ్టన్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని, వివరాలివే

ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.