Ram Charan: ఒడిషా రైలు ప్రమాదంపై రామ్ చరణ్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు సంతాపం

  • IndiaGlitz, [Saturday,June 03 2023]

శుక్రవారం రాత్రి ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ ప్రజలను విషాదంలోకి నెట్టింది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 300కు చేరుకుని వుండొచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే 1000 మంది వరకు గాయపడ్డారు. దీంతో కేంద్రం, ఒడిషా ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేశాయి. ఎస్టీఆర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రైలు ప్రమాద స్థలిని పరిశీలించారు.

ఇదిలావుండగా పలువురు ప్రముఖులు ఒడిషా ప్రమాదంపై దిగ్భ్రాంతి చేస్తున్నారు. దీనిలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ స్పందించారు. ‘‘ బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి మనోధదైర్యం ప్రసాదించాలని కోరుతున్నాను’’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రమాదం ఎలా జరిగింది :

బెంగళూరు నుంచి హౌరాకు వెళ్తున్న బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానాగా బజార్ స్టేషన్ వద్ద తొలుత పట్టాలు తప్పింది. దీంతో ఈ రైలుకు సంబంధించిన బోగీలు పక్కనే వున్న ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్ - చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంగా ఢీకొట్టింది. దీంతో కోరమండల్ రైలుకు సంబంధించి 15 బోగీలు బోల్తా పడ్డాయి. అక్కడితో ఇది ముగియలేదు.. బోల్తా పడ్డ కోరమండల్ బోగీలను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఇలా మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాద తీవ్రత అనూహ్యంగా పెరిగింది.

ప్రమాదం విషయం తెలుసుకున్న రైల్వే, పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలేశ్వర్, భువనేశ్వర్, భద్రక్, మయూర్‌బంజ్, కటక్‌లలోని ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రులను తక్షణం అప్రమత్తం చేసి దాదాపు 115 అంబులెన్స్‌ల ద్వారా వందలాది మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అటు ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోల్తా పడ్డ రైలు నుంచి పలువురి మృతదేహాలను బయటకు తీశాయి.

ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హైల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.

ఒడిశా ప్రభుత్వం- 06782-262286.
రైల్వే హెల్ప్‌లైన్లు:
హౌరా 033-26382217;
ఖరగ్‌పూర్‌ 8972073925
బాలేశ్వర్‌ 8249591559;
చెన్నై 044-25330952

వాల్తేరు డివిజన్‌..

విశాఖ : 08912 746330, 08912 744619
విజయనగరం : 08922-221202, 08922-221206.

దక్షిణ మధ్య రైల్వే :

సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం (040 27788516)
విజయవాడ రైల్వే స్టేషన్‌ (0866 2576924)
రాజమండ్రి రైల్వే స్టేషన్‌ (0883 2420541)
రేణిగుంట రైల్వే స్టేషన్‌ (9949198414)
తిరుపతి రైల్వే స్టేషన్‌ (7815915571)
నెల్లూరు రైల్వే స్టేషన్‌ (08612342028)

More News

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మరో అట్రాక్షన్: మ్యూజిక్ డైరెక్టర్ అతుల్ సాహసం.. బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘‘ఆదిపురుష్’’. ఎన్నో అవాంతరాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.

చరిత్ర సృష్టించిన మోడీ : యూఎస్ కాంగ్రెస్ ఆహ్వానం .. చర్చిల్, మండేలా తర్వాత ఆ ఘనత

అంతర్జాతీయంగా తన పలుకుబడిని పెంచుకోవడమే కాకుండా ఆయా దేశాలతో భారతదేశానికి కూడా సంబంధాలు మెరుగుపరుస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గడిచిన 9 ఏళ్ల కాలంలో భారత దౌత్య విధానం పూర్తిగా మారిపోయింది.

Travel Insurance: 0.45 పైసలతో రూ.10 లక్షల ప్రమాద బీమా.. టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ స్కిప్ చేస్తున్నారా..?

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మంది మరణించడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది.

Pawan Kalyan: ఒడిషా రైలు ప్రమాదం.. ఇకనైనా భద్రతా చర్యలు తీసుకోండి : కేంద్రానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని

Odisha Train Accident: ఒడిషా రైలు ప్రమాదం : రెండు రైళ్లలో 120 మంది ఏపీ వాసులు..

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మంది మరణించడంతో దేశం దిగ్భ్రాంతికి గురైంది.