సాహో దెబ్బ: యూరప్ నుండి నగర శివార్లకు

  • IndiaGlitz, [Thursday,December 19 2019]

పాన్ ఇండియాగా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించిన ప్రభాస్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ‘సాహో’ తర్వాత ‘జాన్’ అనే సినిమాకు ఆయన ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే బాక్సాఫీస్ దగ్గర ‘సాహో’ నిరాశపరచడంతో.. ఆచితూచి అడుగులు వేయాలనుకున్న నిర్ణయానికి వచ్చాడు ప్రభాస్. దీనిలో భాగంగా సినిమా బడ్జెట్‌ను కూడా కాస్త అదుపులో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట.

ప్రభాస్ ఆప్తమిత్రుల సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ ‘జాన్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. 1970ల నాటి కథాంశంతో తెరకెక్కనున్న ఈ పీరియడిక్ రొమాంటిక్ డ్రామాను మొదట యూరప్‌లో నిర్మించాలనుకున్నారు. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ అనుకున్నారట. అయితే సాహో ఫలితాలతో తమ ప్రణాళికలను పూర్తిగా మార్చేసుకుంటుందట చిత్ర నిర్మాణ సంస్థ. బడ్జెట్‌లో పూర్తి నియంత్రణ ఉండాలనే ఉద్దేశంతో... చాలా వరకు సెట్స్‌ను హైదరాబాద్ నగర శివారుల్లోని తెల్లపూర్‌లో వేయనున్నారట. సుమారు ఆరు సెట్లు వేస్తున్నట్టు సమాచారం. పెద్ద స్టూడియోలలో సెట్లకు భారీ మొత్తంలో ఖర్చు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. సుమారు రెండేళ్లకు ఈ భూమిని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రూ. 30 కోట్ల ఖర్చు కాస్త.. రూ.6కోట్లకు తగ్గిందట. సైరా సినిమాకు పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి సెట్ల నిర్మాణ పనుల్లో ఉన్నారట.

ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ భాగస్వాముల్లో ఒకరైన విక్కీకి ఈ సలహా ఇచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అట. అంతంత ఖర్చు పెట్టే బదులు.. నగర శివారుల్లో ప్లాన్ చేయమని చెప్పారట. సైరా నరసింహారెడ్డి సినిమా కోసం ఆవిధంగానే చేశామని చెప్పారట. దీంతో యూవీ క్రియేషన్స్‌కు ఖర్చు భారీగా తగ్గిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్.

More News

ఫోర్బ్స్ టాప్ 100 .. మ‌హేష్‌ను క్రాస్ చేసిన ప్ర‌భాస్‌

ప్ర‌ముఖ ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ 2019 సంవ‌త్స‌రానికిగానూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో అత్యంత ప్ర‌భావంతమైన టాప్ 100 లిస్టుల‌ను విడుద‌ల చేసింది.

'రాఘవ రెడ్డి'గా రానున్న శివ కంఠమనేని

'అక్కడొకటుంటాడు' ఫేమ్ శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 2గా రూపొందుతోన్న చిత్రానికి 'రాఘవ రెడ్డి' టైటిల్ ఖరారు చేశారు.

మరిది కోసం వదినమ్మ.. ఈసారైనా అదృష్టం వరించేనా..?

సిసింద్రీగా టాలీవుడ్‌కి పరిచయమైనా... హీరోగా మాత్రం అనుకున్నంత స్థాయిలో అఖిల్ రాణించలేకపోతున్నాడు.

పాన్ ఇండియా మూవీ.. గీతా ఆర్ట్స్‌తో కలిసి మహేశ్ ప్లాన్

బాహుబలి ప్రభంజనంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఓవర్సీస్‌లో అతని మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.

'దొంగ‌' చిత్రంలో నా పాత్ర డిఫ‌రెంట్ గా ఉంటుంది - న‌టుడు స‌త్య‌రాజ్‌

హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న స‌త్యరాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం `దొంగ‌`.