చరణ్ మూడోసారి ఒప్పుకుంటాడా?

  • IndiaGlitz, [Saturday,November 25 2017]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ త‌న‌తో మూడోసారి న‌టించ‌డానికి ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు అవ‌కాశం ఇస్తాడా?..ఏమో చెప్ప‌లేం అంటున్నారు టాలీవుడ్ జ‌నాలు. వివ‌రాల్లోకెళ్తే..రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమా మాత్రం జ‌న‌వ‌రి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ సినిమాలో ర‌కుల్ హీరోయిన్‌గా చేసే అవ‌కాశం ఉంది. ఎందుకంటే కాజ‌ల్ చెర్రీతో మూడు సినిమాల్లో వ‌రుస‌గా న‌టించింది. త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌కుల్ రెండు సినిమాల్లో న‌టించింది. అదీకాకుండా ద‌ర్శ‌కుడు బోయపాటి గ‌త చిత్రం జ‌య‌జాన‌కి నాయ‌క‌లో కూడా ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. కాబ‌ట్టి రెండు వైపుల నుండి ర‌కుల్‌కు మార్గం సుగ‌మ‌మైన‌ట్లే. కాబ‌ట్టి ఈ సినిమాలో కూడా ర‌కుల్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి.

More News

మహేష్ గుర్తుకొచ్చాడట..

నటి, నిర్మాత, దర్శకురాలిగా రాణిస్తున్న మహేష్ అక్కయ్య మంజుల ఇప్పుడు సిటీ బ్యాక్ డ్రాప్ లో ఓ లవ్ స్టోరిని తెరకెక్కిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.

బ‌రిలో డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కులు

ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌. ప్ర‌స్తుతం ఆయ‌న అక్కినేని అఖిల్‌తో హ‌లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

బాల‌కృష్ణ డేట్‌కే వ‌స్తున్న‌ సూర్య‌?

2018 సంక్రాంతి తెలుగు ప్రేక్ష‌కుల‌కు వినోదానికి చిరునామాలా మార‌నుంది. ఎందుకంటే.. అటుఇటుగా ఏడు సినిమాలు సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి మ‌రి.

'హ‌లో'.. అజ‌య్ ఫ‌స్ట్‌లుక్‌

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా, స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా, హీరోగా.. ఇలా అన్ని కోణాల్లోనూ త‌న న‌ట‌న‌తో మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు న‌టుడు అజ‌య్‌.

న‌య‌న్ స్పెష‌ల్‌

ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ త‌మిళంలో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా రాణించ‌డ‌మే కాకుండా.. కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది.