రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్..

  • IndiaGlitz, [Tuesday,December 29 2020]

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రామచరణ్ స్వయంగా ఓ ప్రకటన ద్వారా వెల్లడించాడు. అయితే తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలూ లేవని.. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని వెల్లడించాడు. త్వరలోనే కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుంటానని ప్రకటనలో తెలిపాడు. ఇటీవల తనను కలిసిన వారందరూ వెంటనే టెస్ట్ చేయించుకోవాలని అవసరమైన ప్రికాషన్స్ తీసుకోవాలని కోరాడు.

‘‘కరోనా టెస్ట్ చేయించుకోగా వైద్యులు పాజిటివ్ అని ధృవీకరించారు. నాకు ఎలాంటి లక్షణాలూ లేవు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుంటాను. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాటు అవసరమైన ప్రికాషన్స్ తీసుకోండి’ అంటూ రామ్ చరణ్ ప్రకటన విడుదల చేశాడు. కాగా... సోమవారం చెర్రీ ‘ఆచార్య’ సెట్స్‌లో ఎంటర్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు తెలుస్తోంది.

More News

కరోనా మార్గదర్శకాలను పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు..

దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి విధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

లీగల్ చిక్కుల్లో అడవి శేష్.. వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు..

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. హీరోగా తనకంటూ మంచి ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్న నటుడు అడవి శేష్.

పార్టీ మారే విషయమై స్పందించిన వివేక్ వెంకటస్వామి

మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ వెంకటస్వామి త్వరలో పార్టీ మారబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నేడు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.

ఏఆర్ రెహ్మాన్‌కు మాతృవియోగం

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లిగారైన కరీమా బేగం నేడు మృతి చెందారు.

భారత్‌లో తొలిసారి అందుబాటులోకి డ్రైవర్‌ రహిత రైలు..

భారత్‌లో తొలిసారి డ్రైవర్‌ రహిత రైలు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రోలో డ్రైవర్ రహిత రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.