మ‌ళ్లీ ఫారిన్‌కు చెర్రీ...

  • IndiaGlitz, [Monday,August 27 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌గా నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం త‌దుప‌రి షెడ్యూల్‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఇటీవ‌ల బ్యాంకాక్ వెళ్లిన యూనిట్ ... ఆ షెడ్యూల్‌ని బ్యాంకాక్‌తో పాటు హైద‌రాబాద్ అవుట్ స్క‌ర్ట్స్‌లో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

ఇప్పుడు మ‌ళ్లీ ఫారిన్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. అందుకోసం సెప్టెంబ‌ర్ 3 నుండి చిత్ర యూనిట్ అజ‌ర్‌బైజాన్ వెళ్ల‌నుంది. ముప్పై రోజుల పాటు ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రగ‌నుంది. కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, స్నేహ‌, అర్య‌న్ రాజేశ్‌, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు.

More News

16వ సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం

16వ సంతోషం సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం  ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్.సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో ఆట పాట‌ల‌తో..తార‌ల త‌ళుకుబెళుకుల నడుమ అంగ‌రంగ వైభవంగా ఎంతో  ఘ‌నంగా జ‌రిగింది.

పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు

పేప‌ర్ బాయ్ చిత్ర ట్రైల‌ర్ కు త‌న ప్ర‌శంస‌లు అంద‌చేసాడు యంగ్ రెబ‌ల్ స్టార్.. బాహుబ‌లి ప్ర‌భాస్. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత కాసేపు చిత్ర‌యూనిట్ తో ముచ్చ‌టించారు.

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ర‌వితేజ‌, ఇలియానా ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు.

వంద‌కోట్ల 'గీత గోవిందం'

రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన త‌ర్వాత ఉన్న‌ట్లుండి సినిమా లీకైంది. నిర్మాత‌ల‌కు పైర‌సీ పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన 'గీత గోవిందం'

'@న‌ర్త‌న‌శాల‌' శాటిలైట్ హ‌క్కులు ఎవ‌రివంటే?

నాగ‌శౌర్య‌, కశ్మ‌రా ప‌ర‌దేశి, యామినీ భాస్క‌ర్ హీరో హీరోయిన్స్‌గా న‌టించిన చిత్రం '@న‌ర్త‌న‌శాల‌'. ఆగ‌స్ట్ 30న సినిమా విడుద‌ల‌వుతుంది.