close
Choose your channels

విక్ట‌రీతో చ‌ర‌ణ్ చిత్రం..!!

Tuesday, February 18, 2020 • తెలుగు Comments

విక్ట‌రీతో చ‌ర‌ణ్ చిత్రం..!!

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన వెంక‌టేశ్‌తో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సినిమా చేయ‌బోతున్నాడా? అంటే అవున‌నే సమాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి వ‌స్తుంది. న‌వ‌త‌రం హీరోల్లో అగ్ర క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న రామ్‌చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీని స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150`ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత చిరు 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`ని కూడా నిర్మించాడు చ‌ర‌ణ్‌. ఇప్పుడు చిరంజీవి152వ ,చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డితో క‌లిసి నిర్మిస్తున్నాడు చ‌ర‌ణ్. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా చేసిన సినిమాల‌న్నీ చిరంజీవితోనే కావ‌డం గ‌మ‌నార్హం. చ‌ర‌ణ్ మ‌రో హీరోతో సినిమా చేయ‌డని అంద‌రూ అనుకుంటున్నారు.

అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు రామ్‌చ‌ర‌ణ్ చేతిలో రెండు మ‌ల‌యాళ సినిమాల హ‌క్కులున్నాయి. వాటిలో `లూసిఫ‌ర్` సినిమాను త్వ‌ర‌లోనే చిరంజీవితో చేయబోతున్నాడు. కాగా... మ‌రో మ‌ల‌యాళ చిత్రం `డ్రైవింగ్ లైసెన్స్‌`ను వెంక‌టేశ్‌తో చ‌ర‌ణ్ నిర్మించ‌నున్నాడ‌ట‌. మ‌రి ఈ సినిమా ఎప్ప‌డు మొద‌ల‌వుతుంది త‌దిత‌ర విష‌యాల‌న్నీబ‌య‌ట‌కు రావ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. ఎందుకంటే ప్ర‌స్తుతం వెంక‌టేశ్ అసుర‌న్ సినిమాలో న‌టిస్తున్నాడు. మ‌రి దీని త‌ర్వాత విక్ట‌రీ..తరుణ్ భాస్క‌ర్ సినిమా చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz