ప్రొఫెష‌న‌ల్ బాక్స‌ర్ వ‌ద్ద చ‌ర‌ణ్ ట్రైనింగ్‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం తార‌క్‌తో క‌లిసి రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం (ఆర్ఆర్ఆర్)’ చిత్రంలో హీరో్యిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ ఆగింది. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌లై ప్రోమోలో చెర్రీ లుక్ స‌రికొత్త‌గా ఉంది. అయితే ఈ లుక్ కోసం చ‌ర‌ణ్ చాలా బాగానే క‌ష్ట‌ప‌డుతున్నాడు. ప్రొఫెష‌న‌ల్ బాక్స‌ర్ నీర‌జ్ గోయ‌త్ ద‌గ్గ‌ర చ‌ర‌ణ్ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకుంటున్నాడు.

ఈ విష‌యాన్ని స‌ద‌రు ట్రైన‌ర్ నీర‌జ్ గోయ‌త్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. చ‌ర‌ణ్‌తో క‌లిసి వ‌ర్క‌వుట్ చేసిన త‌ర్వాత తీసుకున్న ఓ ఫోటోను నీర‌జ్ ట్వీట్ చేశారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కొమురం భీమ్ పాత్ర‌లో తార‌క్ క‌నిపించ‌బోతున్నారు. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. వ‌చ్చేఏడాది జ‌న‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు కానీ క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. వ‌చ్చే ఏడాది జూలైలో సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని సినీ వ‌ర్గాలంటున్నాయి.

More News

తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్‌

ఉత్త‌రాది భామ‌లు ద‌క్షిణాది సినిమాల్లో త‌మ హ‌వా చాటుతున్నారు. ఇప్పుడు ఉత్త‌రాది హీరోయిన్స్ కేవ‌లం అలా వ‌చ్చి సినిమాలు చేసి పోవ‌డ‌మే కాకుండా ఇక్క‌డి వారికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కేంద్రం తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. ఏంటిది ఎందుకిలా చేస్తోందో..!?

కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే టికెట్లపై నగదు వసూలు చేయడం, కరెంట్ తమ ఆధీనంలోకి తీసుకుంటామనే విషయాలపై కేసీఆర్ ఒకింత సీరియస్ అయ్యారు.

15 తర్వాత తెలంగాణలో ఆర్టీసీ నడుస్తుంది : కేసీఆర్

తెలంగాణలో 15 తర్వాత ఆర్టీసీ నడుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆటోలు, క్యాబ్‌లకు గ్రీన్ జోన్లలో మాత్రం పూర్తిగా అవకాశం ఉంటుందన్నారు.

తెలంగాణలో అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు : కేసీఆర్

తెలంగాణలోని మందుబాబులకు సీఎం కేసీఆర్ తియ్యటి శుభవార్త చెప్పారు. రేపట్నుంచే అనగా బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులను తెరుస్తున్నట్లు మీడియా

పదో తరగతి పరీక్షలపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ..

గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదో తరగతి పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోనళపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.