close
Choose your channels

సానియా మీర్జా చెల్లెలి రిసెప్షన్‌లో చెర్రీ, ఉపాసన సందడి

Friday, December 13, 2019 • తెలుగు Comments

సానియా మీర్జా చెల్లెలి రిసెప్షన్‌లో చెర్రీ, ఉపాసన సందడి

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్, టెన్నిస్ రారాణి సానియా మీర్జా సోదరి ఆనమ్‌ల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ పెళ్లి రిసెప్షన్ గురువారం శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు టాలీవుడ్ కుర్ర హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి విందులో చరణ్, ఉపాసన సందడి చేశారు. అజహరుద్దీన్ తోనూ చరణ్ దంపతులు ఎంతో హుషారుగా ముచ్చటిస్తూ కనిపించారు.

కాగా.. సానియా మీర్జాకు, ఉపాసనకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం విదితమే. వీరిద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులు. గతంలో రామ్ చరణ్, ఉపాసన కలిసి హైదరాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీని కూడా సందర్శించారు. అలాగే, న్యూ ఇయర్ రోజున సానియా, ఉసాసన, చెర్రీ మంచుతో ఆటలాడారు. అప్పట్లో వీరి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరోసారి ఈ విందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. మెగాభిమానులు కామెంట్లు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz