close
Choose your channels

చిరు బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేస్తున్న రామ్ చరణ్ యువశక్

Sunday, August 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరు బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేస్తున్న రామ్ చరణ్ యువశక్

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అయిన ఆగస్ట్ 22 కోసం రామ్ చరణ్ యువశక్తి ఇప్పటి నుంచే గిఫ్ట్‌ను సిద్ధం చేస్తోంది. ఆయన పుట్టిన రోజు కంటే ఒకరోజు ముందు ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. మెగాస్టార్'స్ మెగా ర్యాప్ పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.
మెగాస్'స్ మెగా ర్యాప్ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేశారు.

ఈ నెల 21న పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కూడా శివ చెర్రీ నేతృత్వంలో విడుదలైన స్పెషల్ సాంగ్ పలువురి ప్రశంసలు అందుకుంది. సినిమా ప్రముఖులు ప్రత్యేకంగా పాట గురించి కొనియాడారు. మెగా ర్యాప్‌కు కూడా అటువంటి స్పందన వస్తుందని శివ చెర్రీ ఆశిస్తున్నారు.

ఈ పాటకు ఫ్రీక్ మాసన్ సంగీతం అందించారు. సురేంద్ర (స్కార్పియన్) ర్యాప్ ఆలపించారు. నిఖిల్ కాన్సెప్ట్స్ వీడియో కంపోజిషన్ చేసింది. ఇక మెగా ఫ్యాన్స్ సాంగ్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధమైపోవడమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.