రామ్ ‘డబుల్’ ప్రయత్నం ఫలించేనా!?

  • IndiaGlitz, [Friday,October 18 2019]

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఊహించని హిట్టవ్వడంతో కుర్ర హీరో రామ్ మంచి ఊపు మీదున్నాడు. అంతేకాదు ఇక నుంచి అన్నీ మాస్ సినిమాల్లోనే నటించాలని ఫిక్స్ అయ్యాడు. తన దగ్గరికి కథ వినిపించాలని వచ్చే దర్శకులకు కూడా ఒకింత మాస్ కథే కావాలని ఒకింత అల్టిమేటం కూడా పెట్టాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఒకరిద్దరు డైరెక్టర్స్ మాస్ కథతో ఆయన దగ్గరికెళ్లారు.

అయితే ఈ క్రమంలో తన తదుపరి సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రానుంది. ఈ సినిమాను స్రవంతి బ్యానర్లో వస్తోంది.  రామ్ చేయబోతున్న ‘థాడమ్’ అనే చిత్రం తమిళంలో మంచి హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని దర్శకుడు కిషోర్ ఫిక్స య్యాడు. కాగా.. తమిళంలో మగిల్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరుణ్ విజయ్ డబుల్ రోల్‌లో చేశాడు. అంటే తెలుగులో రామ్ కూడా డబుల్ రోల్‌లో చేయబోతున్నాడన్న మాట. రామ్ సరసన హీరోయిన్లుగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ రొమాన్స్ చేయబోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

కాగా.. రామ్ సినీ కెరీర్‌లో ఇంతవరకూ డబుల్‌ రోల్‌లో నటించలేదు.. ఫస్ట్ టైమ్ ఇలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ డబుల్ రోల్‌లో రామ్ ఎలా ఉండబోతున్నాడో..? అసలు ద్విపాత్రాభినయం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే తమిళ్‌లో మార్చిలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా గట్టిగానే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ ఏడాది మార్చిలో వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆ సినిమాను రామ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. తన కెరియర్లో తొలిసారిగా రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

More News

ఆర్టీసీ కార్మికుల విషయంపై ఫస్ట్ టైమ్ తమిళిసై స్పందన

తెలంగాణలో గత రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే కార్మికుల డిమాండ్‌కు సీఎం కేసీఆర్ అస్సలు ఒప్పుకోకపోవడం..

ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా.. కేసీఆర్ శాశ్వతం కాదు!

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వినర్‌ అశ్వద్ధామరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

జగన్‌ పాలన చూసి ఓర్వలేక ఈ దుశ్చర్య!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు అండ, ఆర్థికబలంతో నడిచే పత్రికలు,

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్‌ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రెండు వారాలుగా సమ్మెకు దిగిన తెలిసిందే. తమ డిమాండ్స్ నెరవేర్చాల్సిందేనని కార్మికులు..

బుల్లితెర రంగంలో విషాదం.. ‘బుల్లి బాలయ్య’ కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు ప్రబలిన సంగతి తెలిసిందే. ఆర్ఎంపీ ఆస్పత్రి చూసినా.. ఎంబీబీఎస్ ఆస్పత్రి చూసిన జ్వరాలొచ్చిన జనాలతో కిటకిటలాడుతున్నాయి.